CISF issues apology after Sudha Chandran నటి, నర్తకి సుధా చంద్రన్ కు సీఐఎస్ఎప్ క్షమాపణలు..

Cisf issues apology after sudha chandran shares airport ordeal due to her prosthetic limb

sudha chandran, sudha chandran viral video, sudha chandran cisf, cisf sudha chandran apology, sudha chandram instagram, sudha chandran prosthetic limb, PM Modi, Airport Ordeal, prosthetic limb, Instagram, CISF, apology, Social Media, sudha chandran news

After actor and dancer Sudha Chandran shared her ordeal at the airport due to the ‘grilling’ that was conducted because of her prosthetic limb, the CISF has issued an apology on social media. They have promised that they will look into the matter and will “examine why the lady personnel concerned requested Ms. Sudhaa Chandran to remove the prosthetics.”

నటి, నర్తకి సుధా చంద్రన్ కు సీఐఎస్ఎప్ క్షమాపణలు..

Posted: 10/22/2021 08:34 PM IST
Cisf issues apology after sudha chandran shares airport ordeal due to her prosthetic limb

అల‌నాటి న‌టి, న‌ర్త‌కి సుధాచంద్ర‌న్‌కు సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) క్ష‌మాప‌ణ చెప్పింది. ఇటీవ‌ల సుధాచంద్ర‌న్‌కు ఎయిర్‌పోర్టులో పరాభవం ఎదురైంది. సెక్యూరిటీ విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారిణి.. న‌టి సుధాచంద్ర‌న్‌ను కృత్రిమ కాలును తీసి చూపించ‌మ‌ని అడిగింది. అయితే తన నాట్యవిన్యాసాలను దేశదేశాల్లో ఇస్తున్న సుధాచంద్రన్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రతీసారి ఇదే పరాభావం ఎదురుకావడంతో అమె తీవ్ర మ‌న‌స్తాపం చెందారు. దీంతో ఇవాళ ఉదయం ప్ర‌ధాని మోడీకి ఇలాంటి పరిస్థితులను కనీసం తనలాంటీ సీనియర్ సిటిజన్ల కోసమైనా నిబంధనలను కొంచెం సడలించాలని కోరారు.

ఈ మేరకు అమె తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అమె ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్టు సారాంశం సాగిందిలా.. ‘గుడ్ ఈవినింగ్ ప్ర‌ధాని మోదీగారు నేను మీకొక ప‌ర్స‌న‌ల్ విష‌యం చెప్పాల‌నుకుంటున్నా. ఇది కేంద్ర ప్ర‌భుత్వానికి నా అభ్య‌ర్థ‌న‌. నా పేరు సుధాచంద్ర‌న్. వృత్తిరీత్యా న‌టిని, డ్యాన్స‌ర్‌ను. కృత్రిమ కాలుతో నృత్యాలు చేసి చ‌రిత్ర సృష్టించాను. నా దేశం గ‌ర్వ‌ప‌డేలా చేశాను. నేను నా ఈవెంట్ల కోసం ఎక్క‌డి వెళ్లినా ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ సిబ్బంది నా కృత్రిమ కాలును తీసి చూపించాల‌న‌డం ప‌రిపాటిగా మారింది. ఇది మానవీయ‌మేనా మోదీ గారు..? దేశం ఎక్క‌డికి వెళ్తున్న‌ది..? మ‌న దేశంలో ఒక మ‌హిళ సాటి మ‌హిళ‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా..?’ అని వీడియోలో ప్ర‌శ్నించారు.

మోదీగారు ద‌య‌చేసి సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కు సీనియ‌ర్ సిటిజ‌న్ అని తెలిపే కార్డుల‌ను ఇప్పించండని కోరారు. ఈ వీడియోపై సీఐఎస్ఎఫ్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. నటి, నర్తకి సుధాచంద్ర‌న్ క్షమాపణలు చెబుతూ దిగివచ్చింది. సుధాచంద్రన్ గారూ మీకు క‌లిగిన అసౌక‌ర్యానికి మ‌మ్మ‌ల్ని క్ష‌మించండి. ప్రొటోకాల్ ప్ర‌కారం భ‌ద్ర‌త కోసం కృత్రిమ అవ‌య‌వాల‌ను తీసి చెక్ చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. కానీ ప్ర‌యాణికుల‌ను అవ‌మానించాల‌నే ఉద్దేశం కాదు అంటూ సీఐఎస్ఎఫ్ ట్వీట్ చేసింది. న‌టి సుధాచంద్ర‌న్‌ గ‌తంలో ఓ రోడ్డు ప్ర‌మాదంలో కాలును కోల్పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sudha chandran  PM Modi  Airport Ordeal  prosthetic limb  Instagram  CISF  apology  Social Media  

Other Articles