Prakash Raj alleges political involvement in MAA elections ‘మా’ సభ్యులకు వైసీపీ రౌడీషీటర్ బెదిరింపులు: ప్రకాశ్ రాజ్

Prakash raj alleges political involvement in maa elections with proof

Manchu Vishnu, Movie Artists Association, New President, Manchu Vishnu takes Charge, Manchu Vishnu MAA new prez, Prakash Raj, Prakash raj MAA membership, Prakash Raj loses in MAA Elections, maa elections 2021, maa elections, maa elections 2021 date, maa president telugu election, maa association president election, jeevitha, prakash raj, manchu vishnu, hema actress, maa news, maa president, maa association president, prakash raj news, tollywood, movies, entertainment

Actor Prakash Raj, who was defeated by Vishnu Manchu in the recent elections of the MAA, has alleged foul play by the Manchu family in the elections. He also suggests that there was political involvement in the way the elections were held. Prakash Raj had alleged that a representative of AP's ruling party - the YSRCP was present at the MAA elections, who had helped Vishnu's panel to mislead everyone during the elections.

‘మా’ ఎన్నికలలో మంచువిష్ణు పక్కన రౌడీషీటర్: ప్రకాశ్ రాజ్

Posted: 10/22/2021 07:57 PM IST
Prakash raj alleges political involvement in maa elections with proof

'మా' ఎన్నికల రగడ ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. పోలింగ్ ముగిసి, ఫలితాలు వెల్లడై, కొత్త కార్యవర్గం కొలువుదీరినప్పటికీ ఏదో ఒక అంశం తెరపైకి వస్తూనే ఉంది. అయితే అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎన్నికలు ఇవాళ కీలక మలుపు తిరగబోతున్నాయి. అదెలా అంటే.. ఎన్నికల సందర్భంగా మాకు సంబంధం లేని వ్యక్తి ఎన్నికల కేంద్రంలోకి వచ్చి ఓటర్లను బెదిరించారని ప్రకాశ్ రాజ్ అరోపిస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే.. ఎన్నికల సందర్భంగా వైసీపీకి చెందిన ఒక వ్యక్తి ఎన్నికల హాల్ లో ఉన్నాడని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు.

విష్ణు ప్యానల్ బ్యాడ్జి పెట్టుకుని ఆయన హల్ చల్ చేశారని ఆరోపించారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావు అని, జగ్గయ్యపేటకు చెందిన వాడని తెలిపారు. జగ్గయ్యపేట పీఎస్ లో ఆయనపై రౌడీషీట్ కూడా ఉందని చెప్పారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి జగన్, మోహన్ బాబు, విష్ణులతో సాంబశివరావు దిగిన ఫొటోలను, కొన్ని వీడియోలను ఎన్నికల అధికారికి పంపించారు. ఓటర్లను సాంబశివరావు బెదిరించారని... ఆయన బెదిరింపులకు భయపడిన ఓటర్లు విష్ణు ప్యానల్ కి ఓట్లు వేశారని చెప్పారు. 'మా' సభ్యులు కాని వారిని ఎన్నికల హాల్ లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని వెంట పెట్టుకుని విష్ణు ప్యానల్ తిరిగిందని చెప్పారు.

తాజాగా మంచు విష్ణుతో పోలింగ్ రోజున ఓ వైసీపీ నేత కనిపించాడంటూ ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వైసీపీ నేత ఓ రౌడీ షీటర్ అని తెలిపారు. అంతకుముందే సీసీటీవీ ఫుటేజి కావాలంటూ ప్రకాశ్ రాజ్ 'మా' ఎన్నికల అధికారికి లేఖ రాశారు. కాగా, 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ మరోసారి వివరణ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ లేఖ తనకు అందలేదని అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలకు సంబంధించి తన విధి నిర్వహణ పూర్తయిందని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించడం వరకే తన విధి అని, ఇక తాను చేయడానికి ఏమీలేదని తెలిపారు. తర్వాతి పరిణామాలతో తనకు సంబంధం లేదని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles