Man arrested after stealing journalist's phone during live లవ్ లో రిపోర్టర్ ఫోన్ తస్కరించి.. అడ్డంగా బుకైన దొంగ.!

Thief broadcasts his face to thousands after snatching journalist s phone during live

facebook live stream, journalist's phone stolen, thief on live stream, Thief arrested, thief broadcasted his face, egypt, Crime

A man has been arrested after allegedly stealing a journalist’s phone straight from his hands during a live broadcast in Egypt.Mahmoud Ragheb, a reporter for the news site Youm7, was filming the aftermath of an earthquake live from the streets of Cairo when a man on a motorbike sped past and seized his phone.

లవ్ లో రిపోర్టర్ ఫోన్ తస్కరించి.. అడ్డంగా బుకైన దొంగ.!

Posted: 10/22/2021 06:59 PM IST
Thief broadcasts his face to thousands after snatching journalist s phone during live

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా క్రేజ్‌ పెరిగిపోవడంతో లైవ్‌ ఈవెంట్లు కూడా వీటిద్వారానే ప్రసారం కావడంతో వార్తాప్రపంచం అనేది ప్రజలకు మరింత చేరువైంది.. ఇది కాలక్రమంలో టెక్నాలజీ పరంగా వచ్చిన మార్పుగానే చెప్పవచ్చు. ఎక్కువ న్యూస్‌ టెలికాస్ట్‌ చేయాలన్న ఉద్దేశంతో చాలా సరికొత్త ఈవెంట్స్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. అందలో భాగంగా ఈజిప్ట్‌లోని ఒక న్యూస్‌ చానల్‌ ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తుంటే ఒక విచిత్రం చోటు చేసుకుంది.  

 అసలేం జరింగిందంటే....ఈ జిప్ట్‌లోని యూమ్ 7 న్యూస్‌ చానల్‌  రియల్‌ టైమ్‌ ఈవెంట్‌ అనే సరికొత్త కార్యక్రమంతో ప్రేక్షకులకు మరింత చేరవ కావడానికీ ప్రయత్నిస్తోంది. ఆ తరుణంలో కొన్ని భయంకరమైనవి, ఆసక్తి కలిగించే రియల్‌టైం ఈవెంట్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అయితే ఇటీవల ఈజిప్ట్‌లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రియల్‌టైం ఈవెంట్‌లో భాగంగా భూకంపం తర్వాత ప్రజల పరిస్థితి ఎలా ఉంది అనే న్యూస్‌ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు అనూహ్యంగా ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

అయితే  ఆ రోజు న్యూస్‌ చానల్‌ ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్షప్రసారంలో న్యూస్‌ని జర్నలిస్ట్‌ మహమూద్ రాఘేబ్ నివేదిస్తుండగా అతని ఫోన్‌ని ఒక దొంగ దొంగలిచడం జరుగుతుంది. అయితే ఆ దొంగ ఎలా దొంగలించాడనేది కూడా ప్రత్యక్షంగా ప్రశారంలోనే రికార్డు కావడంతో ప్రజలందరూ అతణ్ని చూశారు. పైగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియోలో వైరల్‌ అవ్వడంతో ప్రజలు ఆ దొంగను పట్టుకోవటానికి కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని  అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles