Janasena to build Damodaram Sanjivayya memorial House ‘‘దామోదరం సంజీవయ్య’’ స్మారక నివాసానికి జనసేనాని కోటి విరాళం.!

Pawan kalyan donates rs 1 cr to build damodaram sanjivayya memorial house

Pawan Kalyan to donate for damodaram sanjivayya memorial house, Janasena to donate for damodaram sanjivayya memorial house, Pawan Kalyan demands kurnool district to be named after Damodaram Sanjivayya, Damodaram Sanjivayya welfare schemes, Damodaram Sanjivayya memorial house, Damodaram Sanjivayya memorial house kurnool district, Pawan Kalyan, Janasena, Damodaram Sanjivayya, welfare schemes, memorial house, kurnool district, Andhra Pradesh, Politics

Janasena Chief Pawan Kalyan has taken Initiative to built a memorial house to the Former Chief Minister of United Andhra Pradesh Damodaram Sanjivayya, who bought so many welfare schemes to the poor people of the state in his CM's regime.

ITEMVIDEOS: ‘‘దామోదరం సంజీవయ్య’’ స్మారక నివాసానికి జనసేనాని కోటి విరాళం.!

Posted: 10/22/2021 04:20 PM IST
Pawan kalyan donates rs 1 cr to build damodaram sanjivayya memorial house

జనసేనాని పవన్ కల్యాణ్ ఓ వైపు బిజీగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన జనసేన పార్టీ వ్యవహరాల్లోనూ చురుగ్గా పాల్గోంటున్నారు. రాజకీయ సమావేశాలు నిర్వహిస్తూనే ర్టీని సంస్థాగతంగా బలపర్చుకునే పనిని తన భుజాలపైకి వేసుకున్నారు. ఈ సందర్భంగా తన కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తూనే.. రాష్ట్రానికి ఎనలేని కృషి చేసి.. మరుగున పడిన పెద్దల గురించి సేవలను మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ జనసేన పార్టీ కొందరు స్ఫూర్తిప్రధాతల అలోచనలను అమలుపరుస్తూ.. వారి అడుగుజాడల్లో నడుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని అన్నారు.

అలాంటివారిలో బుర్గూల రామకృష్ణారావు ఒకరని, తెలుగు వాళ్లందరూ కలసి వుండాలని మనస్ఫూర్తిగా కాంక్షించి.. తన అప్పటి హైదరాబాద్ సంస్థాన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకున్నారని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడుతున్న తరుణంలో రామకృష్ణారావు గారి నిర్ణయం అఖిలాంద్ర రాష్ట్రానికి బీజం వేయడమే కాదు.. సాక్ష్యాత్కరించిందని అన్నారు. ఆ తరువాత మాజీ దేశ ప్రధాని పివీ నరసింహారావు సేవలను ఆయన కోనియాడారు. రాష్ట్రంలో అనేక భూసంస్కరణలు ప్రవేశపెట్టిన ఆయన దేశం అనుభవిస్తున్న ఆర్థిక అభివృద్ది కూడా ఆయన ఆర్థిక సంస్కరణల కారణంగానేనని శ్లాఘించారు.

వీరితో పాటు కేవలం రెండు సంవత్సరాల కాలంలో ఎన్ని అభివృద్ది పనులు చేపట్టవచ్చు.. ఎన్ని సంక్షేమ పథాకాలను ప్రవేశపెట్టవచ్చు అన్నది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గురించి తెలిసిన వారికి మాత్రమే అర్థమయ్యే విషయాలని అన్నారు. ఈ మహానుభావుల గురించి నేటి తరం యువతకు, భావి తరాలకు తెలియకుండా గత ప్రభుత్వాలు చేశాయని, కనీసం ఆయన నివాసం ఉండే ఇంటిని కూడా స్మారక నివాసంగా ప్రభుత్వాలు చేయలేకపోయాయని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

ఈక్రమంలో తమ జనసేన పార్టీ నుంచి విరాళాలు సేకరించి కోటి రూపాయలను ఆయన ఇంటిని స్మారక భవనంగా మార్చే పని చేపడుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. సీఎంగా తన తల్లిని కలిసేందుకు వెళ్లిన తరుణంలో అమెకు రూ. వంద ఇవ్వగా, అమె నువ్వు ముఖ్యమంత్రివి కాబట్టి నాకు ఇచ్చావు.. మరి ముఖ్యమంత్రి కాని బిడ్డల తల్లిదండ్రులకు ఎవరు డబ్బులు ఇస్తారు.? అని అమె వేసిన ప్రశ్నతో.. రాష్ట్రంలోని వృద్దులకు ఫించన్లు తీసుకువచ్చిన మహనీయుడు సంజీవయ్య అని పవన్ తెలిపారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన దామోదరం సంజీవయ్య సేవాగుణం భావితరాలకు తెలియాలని అన్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles