Protests OK, but roads can’t be blocked: SC నిరసనలు మీ ఇష్టం కానీ.. రోడ్ల మూసివేత తగదు: సుప్రీంకోర్టు

You cannot block roads says supreme court farmers remove blockade

farmers protest, farmers, supreme court, supreme court farmers protest, farmers supreme court, ghazipur, bku, bharatiya kisan union, delhi, rakesh tikait, Delhi-Ghazipur border, Supreme Court, Farmers Protest, Farmers Blockade, Farmers Road Blockade, Farmers, Highway blockade, Rakesh Tikait, Politics

The Supreme Court said farmers protesting at Delhi borders against the three farms laws have the right to agitate, but they cannot block roads indefinitely even as the farmer unions and government embroiled themselves in a blame game.

నిరసనలకు వ్యతిరేకం కాదు.. కానీ రోడ్ల మూసివేత తగదు: సుప్రీంకోర్టు

Posted: 10/22/2021 11:07 AM IST
You cannot block roads says supreme court farmers remove blockade

కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలోని సింఘూ, గాజీపూర్‌, టిక్రీ శివారు ప్రాంతాలలో రైతులు గత పదకొండు నెలలుగా నిరసన దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 26న ఢి్లీలోని ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించే క్రమంలో కొందరు అగంతకులు రైతుల మధ్యలో చేరి ఎర్రకోటకు చేరుకుని అక్కడ మతాలకు చెందిన పతాకాన్ని అమర్చడంతో వివాదాస్పదమయ్యింది. పలువురు రైతులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా రైతులు ఇది అగంతకులు పనేనని, తమది కాదని నిరసనలు యధావిధిగా చేపట్టారు.

తమ శాంతియుత నిరసనల మధ్యలోకి అసాంఘిక శక్తులు చోరబడ్డాయన్న రైతుల అరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ మరుసటి రోజు నుంచి రైతులు ఢిల్లీలోకి రాకుండా అడ్డుకట్ట వేసే క్రమంలో కేంద్రం హైవేలను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నదని, అయితే నిరవధికంగా రోడ్లను బ్లాక్‌ చేయడం తగదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రోడ్లపై స్వేచ్ఛగా సంచరించే హక్కు కూడా ప్రజలకు ఉందని గుర్తు చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులను అక్కడి నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిల్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిపింది.

తమ వ్యాఖ్యలు నిరసన తెలిపే హక్కుకు వ్యతిరేకం కాదని, కానీ ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. దీనిపై రైతు సంఘాలు మూడు వారాల్లో స్పందనను తెలుపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) స్పందించింది. రోడ్లపై బ్యారికేడ్లు పెట్టింది ఢిల్లీ పోలీసులేనని, రైతులు కాదని వ్యాఖ్యానించింది. ‘సుప్రీం ఆదేశాలతో గాజీపూర్‌లో రైతులు ఉద్యమాన్ని ఆపేశారు. టెంట్లు తొలగిస్తున్నారు’ అంటూ జరిగిన ప్రచారం వదంతులేనని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles