Priyanka Gandhi vows incentives for women ahead of UP polls యువతులే టార్గెట్ గా కాంగ్రెస్ ఎన్నికల హామీలు

Smartphones scooties for girl students if congress voted to power says priyanka gandhi

U.P. Assembly polls, Yogi Adityanath, Priyanka Gandhi, Congress election sops, smart phones, e-Scooters, Congress women quote for UP polls, BJP, SP, BSP, RahulGandhi, freebies by Congress, vote bank politics, Uttar Pradesh Crime

After promising 40 per cent tickets to women in the Uttar Pradesh assembly elections next year, Congress general secretary Priyanka Gandhi Vadra announced that all class 12 pass girls will be given a smartphone while all graduate girls will get an electronic scooty if her party forms a government in the state.

ప్రియాంకా గాంధీ ఎన్నికల హామీలు.. యూపీ యువతులే లక్ష్యంగా వరాలు

Posted: 10/22/2021 12:01 PM IST
Smartphones scooties for girl students if congress voted to power says priyanka gandhi

వ‌చ్చే ఏడాది ఆరంభంలో జ‌రిగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌లు, యువతులు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వరాలు కొనసాగుతున్నాయి. ఇటీవల మహిళలకు తమ పార్టీలో 40 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫలితం ఎలా వుందో ఇటీవల అమెను అడ్డుకున్న సందర్భంగా మహిళా కానిస్టేబుళ్లు, అధికారులు అమెతో సెల్పీలు దిగడమే ఇందుకు నిదర్శనం. దీంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో మహిళా ఓట్లను టార్గెట్ చేసుకున్న ప్రియాంక గాంధీ.. తాజాగా వారిని మరింతగా ఆకర్షించేలా వరాలను కురిపించారు.

విద్యార్ధినులు, యువ‌తుల‌కు ప‌లు వ‌రాలు ప్ర‌క‌టించారు. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యం సాధిస్తే ఇంట‌ర్ ఉత్తీర్ణులైన బాలిక‌ల‌కు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేష‌న్ చేసే యువ‌తుల‌కు స్కూటీల‌ను ఉచితంగా అంద‌చేస్తామ‌ని ఆమె వెల్ల‌డించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మేరకు తమ ఎన్నికల హామీని నిలబెట్టుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని, మరీ ముఖ్యంగా దళితులు, వెనుకబడిన కులాలకు చెందిన యువతులు, మహిళలపై అకృత్యాలు జరగడమే ఇందుకు నిదర్శనమని పేర్కోన్నారు.

యూపీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో క‌మిటీ ఆమోదం మేర‌కు తాను ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తున్నాన‌ని ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ వివ‌రాలు వెల్ల‌డిస్తూ ప్రియాంక గాంధీ ఓ పోస్ట్‌ను ట్వీట్ చేశారు. కాలేజీ విద్యార్ధినుల‌తో ముచ్చటిస్తున్న వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ప్రియాంక గాంధీ త‌మ‌ను క‌ష్ట‌ప‌డి చ‌దువుకోవాల‌ని కోరార‌ని, త‌మ భ‌ద్ర‌త కోసం ఆమె స్మార్ట్‌ఫోన్లు అందిస్తామ‌ని చెప్పార‌ని ఈ వీడియోలో ఓ యువ‌తి చెబుతుండ‌టం క‌నిపించింది. ఇక రైతుల కోసం, యువత, ఉపాది, ఉద్యోగ అవకాశాల కోసం కూడా కాంగ్రెస్ పలు పథకాలు ప్రకటించనుందని సమాచారం. తమకు ఒకనాడు కంచుకోటగా వున్న ఉత్తర్ ప్రదేశ్ లో మరోమారు తమ పార్టీ పతాకాన్ని రెపరెపలాడించాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles