రాష్ట్రానికి పెద్దగా నిధులు లేకపోయినా.. ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడతారోనని, వారికి సంక్షేమమే తొలి ప్రాధాన్యతగా భావించి.. వారికి అనేక పథకాలను అందిస్తున్న ప్రభుత్వం తమదని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ సందర్భంలో తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీని ప్రజలు పూర్తిగా మర్చిపోయారని.. అందుకనే రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులకే బ్రహ్మరధం పడుతూ వస్తున్నారని అన్నారు. ఇలా ప్రజలకు మరింతగా ఏం చేయాలన్న అలోచనలతో ముందకు వెళ్తున్న తమపై టీడీపీ కావాలనే కొత్త తరహా వ్యవహరిస్తూ.. తప్పు వారు చేసి.. బురద మాత్రం తమపై వేస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాధినేత అని.. రాష్ట్ర రాజ్యంగానికి పెద్ద అని.. అలాంటి తనపై దారుణమై బాషను వినియోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా బోసడీకే అని తిట్టారని... బోసడీకే అంటే 'లం.. కొడుకు' అని అర్థమని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తన తల్లిని కూడా అసభ్యపదజాంతో దూషిస్తున్నారని ఇది సమర్థనీయమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత.. ఇలాంటి బాషను వినియోగింపజేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
ఇదే మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగితే మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకునేవారేనా.? మీ పచ్చమీడియా పెద్ద పెధ్ద శీర్షికలతో ఆ బూతల అర్థాలు, నానార్థాలతో ఎంత హంగామా చేసేదో అని అన్నారు. మీరు ఇలాంటి బాషను, వాటిని వినియోగించిన నేతలను సమర్థిస్తారా.. అని నిలదీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ రూపంలో వున్న అసాంఘిక శక్తులను మనం చూస్తున్నామని ఆయన అక్రోశాన్ని వెల్లగక్కారు. ప్రభుత్వంపై అబద్ధాలు చెపుతూ, గోబెల్స్ ప్రచారంతో మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే కాదు.. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని అయన పేర్కోన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి డ్రగ్స్ కు బానిస అయ్యాడనే విధంగా కామెంట్లు చేస్తున్నారని చెప్పారు.
తమకు అధికారం దక్కలేదని, ఇక ప్రజలు పూర్తిగా మర్చిపోవడంతో తమకు భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న అక్కస్సుతో గత రెండున్నరేళ్లలో కొత్త తరహా నేరగాళ్లను చూస్తున్నామని జగన్ మండిపడ్డారు. తమకు గిట్టని వ్యక్తి సీఎం అయ్యాడని సరికోత్త నేరాలకు ఈ కొత్త నేరగాళ్లు పాల్పడుతున్నారని అన్నారు. అధికారం దక్కలేదని చీకట్లో రథాలను తగులబెట్టి మతాల మధ్య మంటపెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కులాలు మధ్య కుస్తీ రాజేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు ప్రభుత్వానికి దూరం పెంచాలని సంక్షేమ పథకాలను అడ్డుకునేలా న్యాయస్థానాల్లో కేసులు వేస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర పరువు, ప్రతిష్ఠలను దిగజార్చుతున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ కు ఏపీతో సంబంధం లేదని ఇంటెలిజెన్స్, విజయవాడ సీపీ చెప్పినా... ఒక కుట్ర ప్రకారం బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. శాంతిభద్రతలు అనేవి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన విషయమని... వీటిని కాపాడే క్రమంలో సీఎం సహా ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని జగన్ పోలీసులకు చెప్పారు. శాంతిభద్రతలను కాపాడే క్రమంలో ఏమాత్రం రాజీ పడొద్దని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని... తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులకు వారి విధులను గుర్తు చేస్తున్నానని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more