లాటరీ టికెట్ కోనడం కొందరు అలవాటుగా మార్చుకుంటారు. అలవాటులో పోరబాట్లు కూడా జరుగుతుంటాయి. అలా పోరబాటుగానో లేక గ్రహపాటుగానో ఇలాంటి అలవాటే వున్న ఓ మహిళకు లాటరీ తగిలింది. ఇది ఇప్పుడు అనుకుంటున్నారా.. కాదు రెండు దశాబ్దాల క్రితం అంటే 2001వ సంవత్సరంలో. అయితే లాటరీ నిర్వాహకులు తమ నెంబర్లు సరిగ్గా చూసుకున్న తరువాత విజేతలు వారి టికెట్లతో తమ వద్దకు రావాలని ప్రకటించారు. ఇంకేమని సదరు మహిళ వెళ్లి ఏకంగా లాటరీ నెంబర్ చూసుకుంది. తమ టాటరీ టికెట్ బంపర్ ప్రైజ్ తగిలిందని సంబరపడింది. ఏకంగా రూ. 31 కోట్ల రూపాయల లాటరీ ప్రైజ్ మనీ వీరు గెలిచారు.
ఇంతవరకు బాగానే వుంది. అయితే ఉర్దూలో ఓ సామెత ఉన్నట్లు దానే దానే పర్ లిక్ కే రహతే ఖానే వాలే కా నామ్ అన్నట్లు.. లేక అదృష్టం అర కిలోమీటరు చేరువకు చేరుకునే లోపు దురదృష్టం అంటిపెట్టేసుకుంటోందన్నట్లు ఈ మహిళకు దేవుడు లాటరీ టికెట్ విజేతగా నిలిపినా.. వీరి దరదృష్టం మాత్రం వీరిని కష్టాలు, కన్నీళ్లు, చివరకు నిట్టనిలువునా విడిపోయేందుకు కారణమైయ్యింది. అదేంటి సరిగ్గా చెప్పండీ ఏం జరిగిందో..? అంటారా.. ఏముందు లాటరీ టికెట్ ఎక్కడ పెట్టారో గుర్తురాలేదు. దీంతో అది దొరకలేదు.
అయితే తామే ఈ టికెట్ గెలిచామని గెలిచిన వారి నుంచి ఆన్ లైన్ నుంచి డేటా తీసుకెళ్లినా లాటరీ నిర్వహకులు మాత్రం.. టికెట్ పోయిందని అంటున్నారు కాబట్టి మీకు మరో 30 రోజుల వ్యవధిని ఇస్తున్నాం. ఈ లోగా లాటరీ టికెట్ తీసుకువచ్చి డబ్బును తీసుకెళ్లండీ అంటూ చెప్పారు. టికెట్ లేనిదే తాము డబ్బు ఇవ్వలేమని తమ నిబంధనలను మరోమారు సుస్పష్టం చేశారు. దీంతో తమ లాటరీ డబ్బును ఎగవేసేందుకు లాటరీ నిర్వాహకులు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని, లాటరీ టికెట్ తామే తీసుకున్నామని టికెట్ కాకుండా ఇతర ఆధారాలు కూడా చూపినా పట్టించుకోవడం లేదని వారు న్యాయపోరాటం కూడా చేశారు.
ఐదేళ్ల పాటు న్యాయపోరాటం చేసిన తరువాత కూడా విజయం అందుకోలేకపోయారు. ఇక ఈ లాటరీ టికెట్ గెలిచినా ప్రైజ్ మనీ మాత్రం అందుకోలేకపోయామని వారిలో బాధ మాత్రం మిగిలిపోయింది. లాటరీ టికెట్ అదృశ్యం కావడానికి నువ్వ కారణమంటే నువ్వే కారణమంటూ ఒకరినోకరు నిందించుకున్నారు. ఇక న్యాయపోరాటానికి ఉన్న డబ్బంతా ఊడ్చిపెట్టామని వారి మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. ఇలా ఎందుకోచ్చిందో తెలియదు కానీ లాటరీ టికెట్ వారిని నిట్టనిలువునా విడదీసి విడాకులు తీసుకునేలా చేసింది. ఇంతకీ వీరెవరూ అంటారా.. అతని పేరు మార్టిన్ టాట్, అమె పేరు కే. లాటరీతో జీవితాలు బాగుపడ్డ జంటను చూసిన బ్రిటెన్ వాసులు.. గెలిచినా వీధినపడ్డ వీరిని దరదృష్ట జంటగా పరిగణించడం కొసమెరుపు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more