ఏమాత్రం కొంచెం టైమ్ దొరికినా మీకు మంచంపై పడుకునే అలవాటు వుందా.? మంచంపై పడుకుని టీవీని చూడటంపై మీ అభిప్రాయమేంటి.? ఎందుకు అడుగుతార్లేండి.. ఏ మీరు మాత్రం చూడరా..? అంటారా. మరి టీవీ చూస్తూ అలాగే ఎంచక్కా నిద్రపోగలుగుతారా.? అదే మేము రోటిన్ గా చేసే పని అంటారా.? అయితే ఈ 25 లక్షల రూపాయలు మీవే. అదేంటి మంచంపై పడుకుని.. టీవీ చూస్తూ నిద్రలోకి జారుకుంటే పాతిక లక్షలు ఇస్తారా.? అంటే ఔననే చెప్పక తప్పదు. అయితే ఇకనేం మాకు ఇచ్చేయండీ అంటారా.? అయితే కండిషన్ష్ ఇవే..
మంచంపై కూర్చోవడం.. పడుకోవడం.. టీవీ చూడటం.. ఇలా ఏం చేసినా పర్వాలేదు.. అయితే రూ. 25 లక్షలు మీ ప్రైజ్ మనీ కాదండీ.. కేవలం నెలసరి జీతం. అంటే ఇది ఉద్యోగమా.? ఇలా పడుకోవడం, టీవీ చూడటం జాబా.? నిజంగా ఇలాంటి జాబ్ ఉందా.? అయితే ఈ ఉద్యోగం చేయడానికి మేం రెడీ. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి. బెడ్ మీద కూర్చుని టీవీ చూస్తూ, హాయిగా నిద్రపోయే ఉద్యోగం.. ఎందుకాలస్యం ఇప్పుడే అప్లై చేసేస్తాం. డీటైల్స్ చెప్పండీ అంటారా.? ఈ ఉద్యోగం ఇచ్చేందుకు ఓ బ్రిటన్ కంపెనీ ముందుకొచ్చింది. ఇది కల కాదు.. నిజంగానే..! మీరే తెలుసుకోండి..
బిటన్ (యూకే)కు చెందిన ఈ కంపెనీ ఉద్యోగం కావాలని వచ్చిన వాళ్లకు కేవలం బెడ్ మీద గడిపితే చాలు జీతం ఇస్తానని చెబుతోంది. బెడ్‌పై కూర్చుని,ఇష్టమొచ్చినంత సమయం టీవీ చూసి, తర్వాత హాయిగా నిద్రపోతే చాలు జాబ్ సిన్సియర్ గా చేసినట్లే. ఓ లగ్జరీ బెడ్ కంపెనీ ఈ ఆఫర్ అందిస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం ఈ కంపెనీలో జాయిన్ అయిన ఉద్యోగి రోజుకు 6 -7 గంటలు బెడ్ పై గడపవల్సి ఉంటుంది. బెడ్‌పై పడుకుని మ్యాట్రెస్‌ను పరీక్షించి, పరిశీలన జరిపి సమీక్ష చేయడం సదరు ఉద్యోగి పని.
ఈవిధంగా వారానికి కనీసం 37.5 గంటలు పరుపుపై గడిపి తన అనుభవాలను వివరించాలి. ఈ పనికి గాను నెలకు 24 లక్షల 79 వేల రూపాయలు జీతంగా ఇస్తుంది ఈ కంపెనీ. అంతేకాదు ఈ ఉద్యోగం చేయడానికి కష్టపడి ట్రావెల్ చేసి రోజూ కంపెనీకి వెల్లవల్సిన అవసరం కూడా లేదు. ఇంటికే కంపెనీ వాళ్లు బెడ్ పంపిస్తారు. ఇంట్లో బెడ్‌పై గడిపితే చాలు అంటున్నారు క్రాఫ్టెడ్ బెడ్స్ మార్కెటింగ్ మేనేజర్ బ్రియాన్ డిల్లాన్. ఐతే ఈ ఉద్యోగం చేయాలంటే బ్రిటిష్ పౌరసత్వం ఖచ్చితంగా ఉండాలట. ఇంత విచిత్రమైన ఉద్యోగాలు మన దేశంలో కూడా ఉంటే ఎంతబాగుంటుందో కదా!
(And get your daily news straight to your inbox)
Jul 02 | దేశంలో రాష్టప్రతి ఎన్నికలకు తెర లేచిన సందర్భంలో ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి కావని, రెండు సిద్దాంతాల మధ్య పోరుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కోన్నారు. దేశంలో నెలకొన్న ‘అసాధారణ... Read more
Jul 02 | భూమిపైన ఉన్న జంతుజాలంలో మనకు కనబడనవాటినే మనం గుర్తిస్తాం. కానీ మనకు తెలియని ఎన్నోరకాల జీవచరాలు భూమిపై ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇక మనకు తెలిసిన వాటిలోనూ ఎన్నో అరుదైన జీవులు వున్నాయని,... Read more
Jul 02 | రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా... Read more
Jul 02 | దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అత్యంత వేగంగా స్పందించిన పైలట్లు వెనువెంటనే తీసుకున్న చర్యలతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో పాటు క్యాబిన్... Read more
Jul 02 | దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల బలపర్చిన అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్... Read more