Family objects to Manmohan being photographed during Mandaviya’s visit కేంద్ర ఆరోగ్య మంత్రిపై మన్మోహన్ సింగ్ కుమార్తె అగ్రహం..

Not animals in a zoo manmohan s daughter says mandaviya got pix shot in aiims despite objection

Daman Singh furious, Manmohan Singh, Mansukh Mandaviya, Manmohan Singh AIIMS, AIIMS, Mansukh Mandviya

Former Prime Minister Manmohan Singh’s daughter Daman Singh accused Union health minister Mansukh Mandaviya of getting a photographer against the wishes of the family when the minister had gone to enquire about former Prime Minister Manmohan Singh’s health.

పరామర్శలకు వచ్చి పబ్లిసిటీనా?: కేంద్రమంత్రిపై మన్మోహన్ సింగ్ కుమార్తె అగ్రహం..

Posted: 10/16/2021 05:28 PM IST
Not animals in a zoo manmohan s daughter says mandaviya got pix shot in aiims despite objection

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు జూలోని జంతువులేమీ కాదని, తన తండ్రి ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంపై ఆమె తప్పుపట్టారు. డెంగ్యూ వ్యాధికి గురైన మన్మోహన్‌ సింగ్‌ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఆయన కరోనా వైరస్‌కు గురయ్యారు. ఇప్పటికే మన్మోహన్‌సింగ్‌కు 1990, 2009 లో రెండు సార్లు బైపాస్‌ సర్జరీలు జరిగాయి.

ఆరోగ్య సమస్యలతో గత రెండు రోజులుగా మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం దవాఖానకు వచ్చారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మన్మోహన్‌ సింగ్‌ సతీమణి గురుశరన్‌ కౌర్‌ను కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను మాండవీయ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. వీటిని కొన్ని న్యూస్‌ ఛానళ్లు కూడా చూపించాయి. ఈ ఫొటోల్లో మన్మోహన్ సింగ్ మంచం మీద పడుకుని ఉండగా.. ఆయన భార్య పక్కన నిలబడి ఉన్నారు.

‘మన్మోహన్‌సింగ్‌ ఎయిమ్స్‌లో డెంగ్యూ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నది. కేంద్ర ఆరోగ్య మంత్రి వచ్చి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే, పరామర్శిస్తున్న సమయంలో ఫొటోలను తీసుకోవడంపై అమ్మ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ వినిపించుకోకుండా ఫొటోలు తీసుకున్నారు. దీనిపై అమ్మ చాలా బాధపడింది. వాళ్లేమీ జూలో జంతువులు కాదు కదా? కొంచెమైనా నైతికత, వైద్య నిబంధనలు పాటించాలి కదా?’ అని మన్మోహన్‌ సింగ్‌ కుమార్తె డామన్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు.

ఇలాఉండగా, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. కేంద్ర మంత్రి మాండవియా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోలను తొలగించారు. ఫొటోగ్రాఫర్‌ని ఎయిమ్స్‌ వైద్యులు, మేనేజ్‌మెంట్ ఎలా లోపలికి అనుమతించారో చెప్పాలని పలువురు నెటిజెన్లు డిమాండ్‌ చేశారు. ఇలా చికిత్స పొందుతున్న వ్యక్తుల ఫొటోలు తీయడం మెడికల్‌ ఎథిక్స్‌ను ధిక్కరించడమే అవుతుందని ఫోరం ఫర్‌ మెడికల్‌ ఎథిక్స్‌ సొసైటీ సభ్యులు చెప్తున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్‌ గులేరియా మంత్రి వెంటే ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles