AIIMS doctor booked for colleague‘s rape సహచర వైద్యురాలిపై ఎయిమ్స్ వైద్యుడి అత్యాచారం..

Aiims doctor alleges rape by senior colleague case registered

AIIMS doctor raped, Delhi doctor raped by colleague, doctor raped by colleague, Birthday Party, Hauz Khas police station, aiims, rape, doctor, hauz khas, New Delhi, Crime

A senior resident doctor at the All India Institute of Medical Sciences (AIIMS) allegedly spiked his colleague’s drink and raped her at his house in Hauz Khas last month, Delhi Police said. The accused is at large, and searches are on across the city to trace him, they added.

బర్త్ డే పార్టీకి పిలిచి.. సహచర వైద్యురాలిపై ఎయిమ్స్ వైద్యుడి అత్యాచారం..

Posted: 10/16/2021 06:13 PM IST
Aiims doctor alleges rape by senior colleague case registered

తన ఆహ్వానం మేరకు బర్త్‌డే పార్టీకి వచ్చిన ఓ సీనియర్‌ డాక్టర్‌పై మరో డాక్టర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగిపించి లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది. అక్టోబర్‌ 10 వ తేదీన ఈ సంఘటన జరగ్గా.. బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టగా.. నిందితుడు పరారీలో ఉన్నాడు. హౌజ్‌ ఖాస్‌ పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.

ఎయిమ్స్‌లో సీనియర్‌ డాక్టర్‌గా పనిచేస్తున్న ఓ వైద్యురాలు తన సహచరుల్లో కొరి పుట్టినరోజు వేడుకలకు మరో సీనియర్‌ డాక్టర్‌ ఆహ్వానించాడు. అక్కడ కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపిన ద్రవాన్ని తాగిపించి అనంతరం ఆమెపై సీనియర్‌ వైద్యుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు మెలకువ రాగా, ‘ఎవరికైనా చెప్తే చంపేస్తానని’ నిందిత వైద్యుడు బాధితురాలిని బెదిరించాడు.

చివరకు ఐదు రోజుల తర్వాత ధైర్యం చేసిన ఆమె.. హౌజ్‌ ఖాస్‌ పోలీసులను సంప్రదించి తనపై లైంగికదాడికి పాల్పడిన వైద్యుడిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ సిద్ధం చేశారు. కాగా, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. మేజిస్ట్రేట్‌ ఎదుట బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హౌజ్ ఖాస్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 376, 377 కింద కేసు నమోదైనట్లు దక్షిణ జిల్లా డీసీపీ బెనిటా మేరీ జాకర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles