Petrol, diesel prices rally to highest ever levels మళ్లీ పెరిగి కొత్త ఎత్తులను అందుకున్న ఇంధన దరలు..

Petrol diesel price hiked again diesel nears 100 mark in goa bengaluru

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

Petrol and diesel prices have hit an all-time high after state-run oil companies revised rates on Monday. Petrol price is inching closer to Rs 96.41 per litre in Delhi and Mumbaikars will soon pay Rs 102.58 per litre for the essential fuel. Petrol price has been increased by roughly 29 paise per litre while diesel has become dearer by 30 paise.

మళ్లీ పెరిగి కొత్త ఎత్తులను అందుకున్న ఇంధన దరలు.. వాహనదారులు దిగులు..

Posted: 10/16/2021 12:39 PM IST
Petrol diesel price hiked again diesel nears 100 mark in goa bengaluru

ఇంధన ధరల విషయంలో గత ఆరేళ్లుగా కేంద్రం ప్రకటనలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. గత ఎన్నికలకు ముందు ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయమై కేంద్రం ఆలోచిస్తుందని చెప్పుకోచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖామాత్యులు ధర్మేంద్ర ప్రధాన్.. ఆ తరువాత అందుకు రాష్ట్రాలు అంగీకరించడం లేదని చేతులెత్తేశారు. ఈ ఇటీవల జరగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు.. ఇకపై పెంచేది లేదని, ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పినా అవి నీటిమూటలేనని తేలిపోయాయి. ఇక ఇటు ఇంధన ధరలు మాత్రం గత డెబై ఏళ్లలో ఎప్పుడూ లేని గరిష్ట స్థాయికి చేరుకుని రికార్డును నమోదు చేస్తున్నాయి.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత (మే 4) రోజు నుంచి క్రమంగా ఇంథన దరలను పెంచూతూ వస్తోన్న కేంద్రం.. ఇప్పటి వరకు ఏకంగా 25 సార్లు ధరలను పెంచి దేశంలోని అనేక చోట్ల ధరలు వందకు పైగానే చేరుకునేలా చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాలలో లాక్ డౌన్ అములో వున్నా తమ ధరలకు మాత్రం ఎక్కడా చెక్ పెట్టేది లేదని నిర్ణయించుకున్న ఇంధన కెంపెనీలు ఏకంగా మే నెలలో 16 సార్లు ఇంధన ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి, మే నుంచి జూలై వరకు ధరలను విపరీతంగా పెంచిన కేంద్రం.. ఆగస్టు, సెప్టెంబర్లలో మాత్రం ఇంధన ధరలకు కళ్లం వేశాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఇప్పటి  వరకు మూడ వారాల వ్యవధిలో 16 పర్యాయాలు ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి.

ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 35 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 37 పైసల వరకూ పెంచాయి. మే నెల నుంచి ఇప్పటివరకు చమురు ధరను మొత్తంగా 52 సార్లు పెంచిన సంస్థలతో.. దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 35 పైసలు పెరగడంతో రూ. 104.79కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 93.52కు పెరిగింది. ముంబైలో లీటరు పెట్రోలుపై 37 పైసలు పెరగడంతో రికార్డు స్థాయిలో రూ. 110 దాటేసి రూ. 110.75కు చేరుకుంది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 105.39గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.22కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 110.75గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 102.15కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 102.80గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 98.96కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 106.10గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 97.33కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 111.86 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 104.31కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 110.93గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 103.42కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 109.73గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 102.80కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles

Today on Telugu Wishesh