Devaragattu Bunni Festival Clash: Over 60 Injured బన్నీ పండగలో హింస.. విషమస్థితిలో 9 మంది.. 100 మందికి గాయాలు

Devaragattu bunni festival clash nine serious over several injured

Viajaya Dashmi, Dussera, Banni fight, Karrala Samaram, banni utsav, stick fight, Ch Sudheer Kumar Reddy, P Koteswara Rao, Devaragattu, Human Rights Commission, Covid-19 guideline, Gummanur Sreenivasulu, Dasara 2021, Holagonda mandal, Kurnool, Andhra Pradesh, Crime

Every Dasara, the righteous people of Devaragattu village in Holagonda Mandal pour blood when they take up cudgels a gainst demons attempting to steal idols from their village. The fight, known as the ‘Banni fight' or Karrala Samaraam, attracts large spectators from Karnataka and Telangana. The 'fight' is marked by individuals carrying sticks charging at their opponents and thrashing them indiscriminately, culminating in bloodshed.

దేవరగట్టు బన్నీ పండగలో హింస.. విషమస్థితిలో 9 మంది.. 100 మందికిపైగా గాయాలు

Posted: 10/16/2021 11:40 AM IST
Devaragattu bunni festival clash nine serious over several injured

కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో దసరా పర్వదినం రోజున ప్రతీ ఏడాది ఆచారంగా నిర్వహిస్తున్న బన్ని ఉత్సవంలో భాగంగా అర్థరాత్రి కర్రల సమరం జరిగింది. ఈ ఉత్సవంతో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్థులు కర్రలతో యుద్ధం చేశారు. ప్రతీయేటా జరిగే ఈ కర్రల సమరంలో హింస జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా హింస చోటు చేసుకుంది. ఈ సమరంలో వందమందికి పైగా గాయపడగా, తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులను ఆదోని, అల్లుర్ లోని ఆసుపత్రికి తరలించారు. కర్రలు చేతబట్టిన తరువాత తమ ప్రత్యర్థి గ్రామాస్థులపై విరుచుకుపడిన పలు గ్రామాల ప్రజలు కర్రల సమరంలో తలపడటంతో అనేక మంది తీవ్రగాయాల పాలయ్యారు.

అయితే, ఇంత హింస జరుగుతున్నా కూడా పోలీసులు ఈ ఉత్సవాలను ఆపలేకపోతున్నారని వారిపై మానవ హక్కుల కమీషన్ ఆగ్రహం చేస్తున్నారు. దీంతో ఈ బన్నీ ఉత్సవంలో పాల్గొనే 22 గ్రామాల్లో పోలీసులు ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో పాల్గొని భక్తుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు చేశారు.విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో లైట్ల ఏర్పాట్లను కూడా చేశారు. ఇక ఈ ఉత్సవం దసరా, ఆ తెల్లవారి రెండు రోజులు వరకు జరగనుండగా అక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు పోలీసులు. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండమీద మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానిక నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. శుక్రవారం తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ రోజు ప్రజలంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పించి పండుగని జరుపుకున్నారు. అలాగే జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో దసరా రోజు కర్రల యుద్ధం ఉత్సవాలు జరిగాయి.

ఇందులో తలలు పగలగొట్టుకుని మరి యుద్ధం చేస్తారు. మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాల్లో ప్రతి ఏడాది ఈ యుద్ధం ఆచారంగా జరుగుతుంది. ఇక ఈ యేడు కూడా ఈ ఉత్సవం జరిగింది. ఈ యుద్ధంపై స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగానే హింస జరిగింది. ఇటువంటి ఘోరమైన యుద్ధంలో తలలు పగులుతాయని అంతకుముందే మానవ హక్కుల కమిషన్ బాగా సీరియస్ అయ్యాయి. అంతేకాకుండా కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు కూడా నోటీసులు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh