UK MP David Amess dies due to Stabbing Multiple Times ‘మీట్ యువర్ ఎంపీ’ కార్యక్రమం.. పార్లమెంటు సభ్యుడి దారుణ హత్య

Uk mp david amess was stabbed 17 times attack was planned says report

David Amess, uk politician, david amess stabbed, conservative leader, UK stabbing, David Amess stabbing, terror attack, Leigh-on-Sea, United Kingdom

A British lawmaker was stabbed to death in a church by a man who lunged at him at a meeting with voters from his electoral district, knifing him repeatedly. David Amess, a 69-year-old lawmaker from Prime Minister Boris Johnson's Conservative Party, was attacked at around midday at a meeting at the Belfairs Methodist Church in Leigh-on-Sea, east of London.

చర్చిలో ‘మీట్ యువర్ ఎంపీ’ కార్యక్రమం.. పార్లమెంటు సభ్యుడి దారుణ హత్య

Posted: 10/16/2021 10:42 AM IST
Uk mp david amess was stabbed 17 times attack was planned says report

బ్రిటన్ లో దారుణం జరిగింది. చర్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పార్లమెంటు సభ్యుడిని అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగుడు ఎంపీ పై కత్తితో విరుచుకుపడి ఏకంగా 17 పోట్లు పోడిచి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నేత, ఎంపీ అయిన సర్ డేవిడ్ అమీస్ (69) శుక్రవారం తూర్పు లండన్ లోని స్థానిక లీ-ఆన్-సీ అనే చిన్న గ్రామంలో ఓ చర్చిలో నిర్వహించిన ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనపై అకస్మాత్తుగా ఓ వ్యక్తి దాడిచేసిన కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలు కావడంతో పాటు తీవ్ర రక్తస్రావం ఎదుర్కన్న పార్లమెంటు సభ్యుడు ఘటనాస్థలంలోనే మరణించారు.

అయితే ఎంపీపై హత్యకు తెగబడిన వ్యక్తిని బ్రిటెన్ లోని సోమాలి ప్రాంతానికి చెందిన బ్రిటన్ పౌరుడిగా గుర్తించారు పోలీసులు. అయితే హత్య చేసిన తరువాత నిందితుడు ఘటనాస్థలంలోనే మౌనంగా కూర్చోని పోలీసులు రాక కోసం వేచిచూశాడని స్థానికులు తెలిపారు, దీంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అమీస్ 1983 నుంచి ఎంపీగా ఉన్నారు. ఎసెక్స్‌‌లోని సౌత్ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జంతు సమస్యలతోపాటు, గర్భస్రావాలకు వ్యతిరేకంగా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు. అమీస్ మృతికి ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను భయంకరమైనదిగా, తీవ్ర దిగ్భ్రాంతికరమైనదిగా ప్రతిపక్ష లేబర్ పార్టీ అభివర్ణించింది.

డేవిడ్ అమిస్ సేవలను ప్రశంసించిన బ్రిటన్ రాణి ఎలిజిబెత్ అయనకు సర్ అనే బిరుదునిచ్చి సత్కరించారు. బ్రిటన్‌లో ఎంపీలపై దాడులు గతంలోనూ పలుమార్లు జరిగాయి. 2016 బ్రెగ్జిట్ సమయంలో లేబర్ పార్టీ ఎంపీ జో కాక్స్‌ కాల్చివేతకు గురయ్యారు. 2010లో లేబర్ పార్టీ ఎంపీ స్టీఫెన్ టిమ్స్‌పై దాడిచేసిన దుండగులు కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. 2000వ సంవత్సరంలో లిబరల్ డెమొక్రటిక్ ఎంపీ నీగెల్ జోన్స్‌పై దాడి జరిగింది. జులై 30, 1990లో కన్జర్వేటివ్ ఎంపీ ఇయాన్ గౌ కారు బాంబు దాడిలో మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో పార్లమెంటు సభ్యులకు కల్పించాల్పిన భద్రతపై డిమాండ్లు పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles