Petrol, diesel rates hiked sharply for 3rd straight day చారిత్రక గరిష్టానికి చేరి.. పైకి ఎగబాకుతున్నఇంధన ధరలు..

Lpg price hiked by rs 15 cylinder petrol and diesel prices at all time high in india

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

On Thursday (October 7), petrol and diesel prices went up on a record high across the country. A litre of petrol costs Rs 103.24 in Delhi, a hike of 34 paise, while the rate of diesel was Rs 91.77 per litre, a hike of 35 paise. In Mumbai, petrol is priced at Rs 109.25 per litre, which is costlier by 29 paise and diesel costs Rs 99.55 for one litre, a 38 paise increase.

వరుసగా మూడవ రోజు పెరిగిన ఇంధన ధరలు.. చారిత్రక గరిష్ట స్థాయికి..

Posted: 10/07/2021 12:12 PM IST
Lpg price hiked by rs 15 cylinder petrol and diesel prices at all time high in india

డెబై ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఇంధన ధరలు పైపైకి ఎగబాగుతున్నాయి. జూలై నెల 17న తొలిసారిగా అత్యంత అధిక ధరలకు చేరిన చమురు ధరలు.. ఆ తరువాత కాసింత కిందకు జారి.. మళ్లీ రెండు నెలల తరువాత ఆ ధరలను మించిపోయి అల్ టైమ్ హై స్థాయిని అందుకున్నాయి. చమురు ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చె్ప్పిన కేంద్రం.. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 4 నుంచి వరుసగా ఇంథన దరలను పెంచూతూ వాహనదారులకు షాకిస్తోంది. ఇటు పెట్రోల్, అటు డీజిల్ ధరల పెంపుతో దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. ఇక డీజిల్ కూడా పెట్రోల్ ధరను అందుకునే దిశగా పయనిస్తోంది. ఇక ఇంధన ధరల గణనీయమైన పెంపుతో మరీ ముఖ్యంగా డీజిల్ ధర పెంపు ప్రభావం నిత్యావసర సరుకులతో పాటు అన్ని రంగాలపై పడుతోంది.

చమురు కెంపెనీలు ఇంధన ధరలను మే నెలలో ఏకంగా 16 సార్లు పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి. జూన్ నెలలో 16 సార్లు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జూలైలో పది పర్యాయాలు పెంచాయి. అయితే ఇంధన ధరలను తగ్గించాల్సిందేనన్న డిమాండ్ పెల్లుబిక్కిన నేపథ్యంలో గత రెండు నెలలుగా ఇంధన ధరల జోలికి వెళ్లన చమురు సంస్థలు.. సెప్టెంబర్ నెలాఖరులలో మాత్రం మళ్లీ వాహనాదారులకు షాకిచ్చాయి. ఇక అక్టోబర్ నెల నుంచి వరుసగా ఇంధన ధరలు పెరుగుతూనే వున్నాయి. అక్టోబర్ మాసంలో పండుగ పర్వదినాలు రావడంతో ఎవరి పనులలో వారు నిమగ్నం కాగా, చాప కింద నీరులా ధరలను పెంచుతూనే వున్నాయి ఇంధన కంపెనీలు. కాగా, దీంతో పాటు దాదాపుగా దేశంలోని అన్ని మెట్రోపాలిటిన్ నగరాలతో పాటు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.110 మార్కును అందుకునేందుకు పరుగులు పెడుతొంది.

ఇక తాజాగా డీజిల్ దర కూడా వంద మార్కును అందుకునే దిశగా కదులుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 25 పైసలు మేర పెంచిన ఇంధన సంస్థలు, డీజిల్‌ ధరపై ఏకంగా మరోమారు 30 పైసల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాది మే 3న దేశ రాజధాని ఢిల్లీలో పెట్రల్ ధర 90.40గా నమోదు కాగా డీజిల్ ధర 80.73గా నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు చమురు ధరను 49 పర్యాయాలు పెంచిన కేంద్రం.. మే నెల నుంచి తాజా పెంపు వరకు పెట్రోల్ పై రూ.12.84, డీజిల్‌పై 11.04 వరకు చమరు కంపెనీలు పెంచాయి. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకుంది. రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్ రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 110కి చేరుకోగా..  తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.107 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 103.24గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.91.77కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.109.25గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.99.55కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.100.75గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.96.25కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.103.94గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.94.88కు చేరింది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ..108.56 కాగా, లీటరు డీజిల్ ధర రూ.100.14కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.107.09గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 99.75కు చేరింది.
బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.106.52గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.97.03కు చేరింది.
పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.106.24గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ. 98.25కు చేరింది.
భూపాల్ లో లీటరు పెట్రోల్ ధర రూ.111.76గా నమోదు కాగా, లీటరు డీజిల్ రూ.100.80కు చేరింది
చండీగఢ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.99.38గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.91.50కు చేరింది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ. 100.31గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.92.20కు చేరింది.
తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.105.48గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.98.72కు చేరింది.

ఇక దీనికి తోడు నిన్న అటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను కూడా రూ. 15 మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles