Texas High School shooting leaves four injured అమెరికాలో సహచరులపై కాల్పులు జరిపిన విద్యార్థి

4 injured in shooting at timberview high school in arlington texas

US Gun Culture, Texas school shooting, Timberview High School, Arlington shooting, Four Injured, Dallas area school district, Mansfield Independent School District, Dallas-Fort Worth metropolitan area, United States

Four people were wounded in a shooting at Timberview High School in Arlington, Texas. A Dallas-area school district said that law enforcement was responding to reports of an “active shooter situation” at a High school. The Mansfield Independent School District said in a news release that Timberview High School was on lockdown. The school is in Arlington, which is part of the Dallas-Fort Worth metropolitan area.

అమెరికా గన్ కల్చర్: సహచరులపై కాల్పులు జరిపిన విద్యార్థి

Posted: 10/07/2021 11:29 AM IST
4 injured in shooting at timberview high school in arlington texas

అమెరికాలో తుపాకి సంస్కృతి నిట్టనిలువునా అమాయక దేశప్రజల ప్రాణాలను తీస్తోంది. ఈ విష సంస్కృతిపై ఆంక్షలు విధిస్తామని అంటూనే ఎప్పటికప్పుడు తాత్సారం చేస్తున్న ప్రభుత్వాలు.. అమాయకులను బలితీసుకుంటున్నాయి. అమెరికాలో నిత్యం ఏదో ఒక మూల ఈ విష సంస్కృతి తన ప్రతాపాన్ని చాటుతూనే వుంది. అధ్యక్షుడిగా బరాక్ ఒబామ ఉన్న హయాంలో ఈ విష సంస్కృతిపై చర్యలు తీసుకునేలా కొంత చర్చ జరిగినా.. ఇప్పటికీ ఆంక్షలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి.

తాజాగా విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలోనూ కాల్పులకు కారణమైంది. టెక్సాస్ లోని అర్లింగ్టన్ లోగల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. డాల్లస్ ఫోర్ట్ వర్త్ మెట్రోపాలెటిన్ ఏరియా పరిధిలోకి వచ్చే టింబర్ వ్యూ పాఠశాలలో విద్యార్థుల మధ్య ప్రారంభమైన ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 18 ఏళ్ల విద్యార్థి కాల్పులు ప్రారంభించగా భయంతో అందరూ పరుగందుకున్నారు. ఈ క్రమంలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

సమాచారమందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పాఠశాలలో మొత్తం 1900 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాల్పులు జరిపిన నిందితుడిని తిమోతీ జార్జ్ సింప్‌కిన్స్‌గా గుర్తించారు. అతడిపై మూడు అభియోగాలు నమోదు చేశారు. కాగా, తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles