Huzurabad bypoll:BJP Eetala fires on TRS, Harish Rao రెండు గుంటల అభ్యర్థికి 200 కోట్లు ఎక్కడివి.?: హరీశ్ పై ఈటెల ఫైర్

Huzurabad bypoll bjp candidate eetala rajender fires on harish rao and trs

TRS Party President, TRS KCR, Chief Minister K Chandrashekhar Rao, Gellu Srinivas Yadav, Harish Rao, PeddiReddy, Central Election Commission, by-election, Huzurabad by-election, Huzurabad bypoll, Huzurabad, By-polls, Telangana, Politics

TRS Expelled Minister and BJP Candidate for Huzurabad Assembly constituency Eetala Rajender questioned TRS Party Chief, CM KCR and Minister Harish Rao on how the two guntas land owner is spending Rs 200 crores in Huzurabad by poll.

రెండు గుంటల అభ్యర్థికి 200 కోట్లు ఎక్కడివి.?: హరీశ్ పై ఈటెల ఫైర్

Posted: 10/05/2021 01:18 PM IST
Huzurabad bypoll bjp candidate eetala rajender fires on harish rao and trs

టీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ లో మీటింగులకు ఇతర నియోజకవర్గాల నుంచి ప్రజలను రప్పించి అందరినీ అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో తాము నియోజకవర్గ ప్రజలను నమ్ముకుంటే.. అధికార పీఠంపైనున్న కేసీఆర్ డబ్బు మూఠలను, పరాయి మూకలను నమ్ముకుంటున్నారని ఈటెల తీవ్రస్థాయిలో పైర్ అయ్యారు. కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారని... తన టక్కుటమార విద్యలన్నింటిని హుజూరాబాద్ లో ప్రదర్శిస్తున్నారని అన్నారు. కేసీఆర్ గిమ్మిక్కులు చెల్లవని చెప్పేరోజు ఈనెల 30వ తేదీ అని చెప్పారు.

తనపై ముప్పేట దాడి చేసేందుకు యత్నిస్తున్న కేసీఆర్.. ఈ ఎన్నికలలో గెలిస్తే మరో 20 ఏళ్లు తెలంగాణను తన బానిస శృంఖాల కింద ఉంచవచ్చననే యోచనలో వున్నారని అరోపించారు. తనను ఎదుర్కొనే దమ్ము లేకే... తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఒక్క ఎకరం ఆక్రమించుకున్నా ముక్కు నేలకు రాస్తానని తన భార్య సవాల్ చేస్తే ఇంతవరకు కేసీఆర్ నుంచి స్పందనే లేదని అన్నారు. హుజూరాబాద్ లో తాను పోటీ చేస్తుంటే.. తనను ఓడించేందుక కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనించారని అన్నారు. ఈ ఉప ఎన్నికల వల్లే తమ నియోజకవర్గంలోని దళితులకు దళిత బంధు పథకం అమలులోకి వచ్చిందన్నారు.

తన కారణంగానే ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం లభిస్తోందని ఈటెల అన్నారు. హుజురాబాదులో జరుగుతున్నది ఉప ఎన్నిక.. అయితే ఇక్కడ తనను ఓడించేందుకు టీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నదని ఈటెల దుయ్యబట్టారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలేక తాను పార్టీ నుంచి బయటకు వస్తే.. సానుభూతి కోసం యత్నిస్తున్నానని హరీశ్ రావు అబద్ధాలే చెపుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు హరీశ్ పై ఎంతో గౌరవం ఉండేదని.. మామకు పూర్తిగా బానిసై, ఇప్పుడు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాటాకు చప్పుళ్లకు లొంగే వ్యక్తిని తాను కాదని చెప్పారు.
 
తన వద్దకు ఎవరు వచ్చినా.. వారి ఇంటికి ఓ కారు వచ్చి హరీశ్ ఇంటికి తీసుకెళుతుందని ఈటల అరోపించారు. ఈ సందర్భంగా అవేశానికి లోనైన ఈటెల హరీశ్ రావుపై ఏకవచన సంబోధనతో రెచ్చిపోయారు. టీఆర్ఎస్ నేతలు అరోపిస్తున్నట్లు.. తనతో హుజూరాబాద్ లో పోటీ పడుతున్న అభ్యర్థితో పోల్చి రెండు గుంటల రైతుతో రెండువందల ఎకరాల ఆసామి పోటీపడుతున్నారని అంటున్నారని.. మరీ అదే రైతు రెండు వందల కోట్ల రూపాయలను ఎన్నికలలో ఎలా ఖర్చు పెడుతున్నారని ఈటెల ప్రశ్నించారు. తనను గెలిపించి హూజూరాబాద్ లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలను ఈటల కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles