Facebook-owned platforms services resumed after outage వాట్సాఫ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవల పునురుద్దరణ

Whatsapp facebook instagram recover after almost six hour outage

whatsapp, facebook, instagram, down, outage, internet, India, Whatsapp down, shutdown, Twitter, Facebook-owned platforms

Facebook, WhatsApp and Instagram at least partially reconnected to the global internet after a nearly six-hour outage. The three Facebook-owned platforms were down in many parts of the world, users reported on Monday night. On Twitter, people posted messages saying these platforms were inaccessible from around 9 pm IST. Around 400 million people use one or more of these platforms in India.

పేస్ బుక్ అనుబంధ సామాజిక మాద్యమాల సేవల పునరుద్దరణ

Posted: 10/05/2021 11:42 AM IST
Whatsapp facebook instagram recover after almost six hour outage

సామాజిక మాద్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు దాదాపుగా ఆరు గంటల వ్యవధి తరువాత తిరిగి అందుబాటులోకి వచ్చాయి. గతరాత్రి నుంచి ఆకస్మికంగా సేవలు నిలిచిపోవడంతో ప్రపంచమే నిలిచిపోయిందన్న భావన నెట్ జనులలో కలిగింది. తమ సెల్ ఫోన్ లలో సాంకేతిక లోపం ఎదురైందా.. లేక సామాజిక మాద్యమాల సర్వీసులలోనే లోపం ఏర్పడిందా.? అన్న ప్రశ్నలు తలెత్తడంతో మళ్లీ పాత పద్దతిలో వాయిస్ కాల్ చేసుకుని మిత్రుల నుంచి సమాచారం పోందారు నెటిజనులు. తాము ఇదే సమస్యను ఎదుర్కోంటున్నామన్న సమాధానం సంతృప్తి చెందారు.

ప్రపంచవ్యాప్తంగా క్రితంరోజు రాత్రి 9 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల సేవలన్నీ ఒక్కసారిగా నిలిచిపోవడంతో కోట్లాదిమంది వినియోగదారులు ఇబ్బందిపడ్డారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫేస్‌బుక్.. సేవల పునరుద్ధరణకు నడుం బిగించింది. మొత్తానికి ఈ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దాదాపు ఏడు గంటలపాటు సేవలు స్తంభించిన తరువాత వాటిని పునరుద్దరించారు. ఫేస్ బుక్ సోంతం చేసుకున్న మూడు అతిపెద్ద సామాజిక మాద్యమాల సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంపై ఫేస్‌బుక్ క్షమాపణలు తెలిపింది.

దేశంలో ఈ మూడు మాద్యమాలను ఏకంగా నలభై కోట్ల మంది ఫేస్ బుక్ యాజమాన్య పరిధిలో నడిచే వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, పేస్ బుక్ ఈ మూడు మాద్యమాలలో ఏదో ఒకటిని వినియోగిస్తున్నారు. ఇక వీటి సేవలు పునరుద్దరణ జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా తమ సేవలు తిరిగి ఆన్‌లైన్‌లోకి వస్తున్నందుకు ఆనందంగా ఉందని ఫేస్ బుక్ పేర్కొంది. తమకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొంది. కాగా, గత రాత్రి సామాజిక మాధ్యమాలన్నీ ఒక్కసారిగా మూగబోవడంతో ఏం జరుగుతోందో అర్థంకాక వినియోగదారులు అయోమయానికి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ట్విట్టర్ ద్వారా ప్రయత్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : whatsapp  facebook  instagram  down  outage  internet  India  Whatsapp down  shutdown  Twitter  Facebook-owned platforms  

Other Articles