Sonu Sood Charity .. Another step for public service పేదలకు సోనూసూద్ ఛారిటీ మరో శుభవార్త.. ఇకపై ఈఎన్టీ సర్జరీలు ఫ్రీ

Sonu sood charity another step for public service

sonu sood, Real Hero, sonu sood Charity, Sood Charity Foundation.org, ENT surgeries, Ear, Nose, Tongue, Telangana, Andhra Pradesh, Politics

We are happy to offer ENT operations for free. “Let’s enjoy the sound, the smell, the taste,” Sonu said. Those who want these services need to log in to Sood Charity Foundation.org. The website should include their details as well as what treatment they need.

పేదలకు సోనూసూద్ ఛారిటీ మరో సేవ.. ఇకపై చెవి, ముక్కు, నాలుక సర్జరీలు

Posted: 09/29/2021 03:04 PM IST
Sonu sood charity another step for public service

కలియుగ దానవుడిగా దేశప్రజల మనస్సులలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్న రియల్ హీరో సోనూసూద్ పేదలకు మరో సేవను కూడా అందుబాటులోకి తీసుకువచ్చాడు. కరోనా మహమ్మరి నేపథ్యంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చే నేపథ్యంలో.. వారి ఆకలిదప్పికలను తీర్చే క్రమంలో ప్రారంభమైన ఆనయ సేవా కార్యక్రమాలు ఇంతింతై వటుడింతై అన్నట్లు దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూనే వున్నాయి. సాయం కోసం చేతులు చాచిన అన్నార్తులకు సాయం చేసేందుకు ముందుకువచ్చిన మహావ్యక్తి సోనూసూద్.

తన దృష్టికి ఆర్తుల వినతి చేరడమే అలస్యమన్నట్లు సాయానికి ఆపన్నహస్తం అందిస్తున్నాడు సోనూసూద్. నేరుగా అడిగినా, ఫోన్లో అడిగినా, సామాజిక మాద్యామాల ద్వారా అడిగినా.. తమ వారితో అడిగించినా సాయం అందించేవ్యక్తి సోనూసూద్. అంబులెన్సులు మొదలుకుని ఐఏఎస్, సీఏ, లా కోచింగ్లను అందిస్తున్న ఆయన ఛారిటీ ఫౌండేషన్.. సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు వేసింది. ఈ సారి దేశంలోని పేదప్రజలందరికీ ఉచితంగా ఈఎన్టీ అంటే చెవి, ముక్కు, నాలుగలకు సంబంధించిన శస్త్రచికిత్సలను ఉచితంగా చేయించనున్నారు, తన చారిటీ పౌండేషన్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా సోనూసూద్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఇందుకు సంబంధించిన పోస్టును పెడుతూ.. ‘ఈఎన్‌టీ సర్జరీలను ఉచితంగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇకపై.. వాసన, రుచి, శబ్దం చక్కగా ఆస్వాదిద్దాం’ అంటూ పోస్ట్ చేశాడు. ఆ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో సూద్ ఛారిటీ ఫౌండేషన్ కు చెందిన వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచాడు. ముందుగా www.soodcharityfoundation.org వెబ్ సైట్‌ ఓపెన్ చేస్తే .. ఉచితంగా అందించే ఈఎన్‌టీ సర్జరీలకు సంబంధించి వివరాలు ఉంటాయి. రిజిస్టర్‌ ఆప్షన్‌ లేదా బార్‌కోడ్‌ స్కాన్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ ఫామ్ ఓపెన్‌ అవుతుంది. ఇందుకు రోగుల వివరాలతో పాటు.. వారికి అవసరమైన శస్త్రచికిత్స గురించిన వివరాలను పోందుపర్చాలి.

అన్ని వివరాలను పోందుపర్చిన తరువాత సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేస్తే అది తమకు చేరుతుందని తెలిపారు. ఇటీవల ఆదాయ పన్ను అధికారులు సోనూసూద్ నివాసం, కార్యాలయాలపై దాడులు చేసి.. ఆయన దాదాపు రూ.20 కోట్లు ప‌న్ను క‌ట్ట‌కుండా త‌ప్పించుకున్నార‌ని ఐటీ అధికారులు చెప్పారు.  మొత్తం 19 కోట్ల‌ు సేకరించి అందులో రెండు కోట్ల రూపాయ‌ల‌నే ఉప‌యోగించార‌ని, మిగ‌తా మొత్తాన్ని త‌న ఖాతాలోనే ఉంచుకున్నార‌ని కూడా అధికారులు వెల్లడించారు.  అయితే దీనిపై సోనూసూద్ అభిమానులు, ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్న సోనుపై ఐటీ దాడుల‌ను ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles