Supreme Court lashes out at firecracker manufacturers బాణాసంచా తయారీదారులపై సుప్రీంకోర్టు మండిపాటు

Right to life above right to employment supreme court on firecracker ban

firecracker ban, Diwali 2021, Supreme Court On Firecrackers, Firecracker Manufacturers, Diwali Firecracker Ban, SC On Firecracker Ban, cracker ban, diwali crackers ban, firecrackers supreme court, diwali firecrackers, diwali crackers, air pollution

firecracker ban, Diwali 2021, Supreme Court On Firecrackers, Firecracker Manufacturers, Diwali Firecracker Ban, SC On Firecracker Ban, cracker ban, diwali crackers ban, firecrackers supreme court, diwali firecrackers, diwali crackers, air pollution

కొందరి ఉపాధి హక్కు కన్నా ప్రజల జీవించే హక్కుకే ప్రాధాన్యత: సుప్రీం

Posted: 09/29/2021 01:19 PM IST
Right to life above right to employment supreme court on firecracker ban

దీపావళి పండగ అనగానే చిన్నారుల నుంచి పెద్దల వరకు నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో పండగ సంబరాల్లో పాల్గోంటారు. అందుకు కారణం బాణాసంచా కాల్చడమే. అయితే ఈ ఏడాది బాణాసంచా విక్రయాలను పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా ప్రభుత్వాలు నిషేధం విధించాయి. గత ఏడాది కొనసాగించిన విధంగానే ఈసారి కూడా యధాతధంగా నిసేధం కోనసాగుతున్నట్లు అదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపుతట్టిన బాణాసంచా తయారీదార్లకు అక్కడ చుక్కెదురైంది. వీటి తయారీలో విషపూరితమైన బేరియం సహా పలు పదార్థాలను వినియోగించడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాణాసంచాలో బేరియం సహా పలు విషపూరితమైన పదార్థాలను వినియోగించడం.. 2018లో సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను అతిక్రమించడమేనని పేర్కోంది. గతంలో ఇచ్చిన అదేశాల మేరకు బాణాసంచాలో ఎలాంటి విషపూరిత పదార్థాలను వినియోగించరాదని న్యాయస్థానం అదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తిుచేసింది. కొందరి ప్రజలు ఉపాధి హక్కు నేపథ్యంలో ప్రజలందరీ ఆరోగ్యాన్ని పణ్ణంగా పెట్టలేమని.. కొందరి ఉపాధి హక్కు కోసం ప్రజల జీవించే హక్కును కాలరాయలేమని పేర్కోంది.

అమాయకుల జీవించే హక్కును పరిరక్షించడమే తమ విధి అని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, ఏఎస్ బొప్పన్నాలతో కూడిన సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం అభిప్రాపయపడింది. బాణాసంచా తయారీలో బేరియం వినియోగించడంతో పాటు వాటిని ఫలానా కంపెనీ బాణాసంచాగా ముద్రించి విక్రయాలు జరపడం న్యాయస్థానం అదేశాలను అతి్రక్రమించడమేనని అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది. బాణాసంచా తయరీలో విషపూరిత రసాయానాలు వినియోగించడంపై హిందుస్తాన్ ఫైర్ వర్క్స్, స్టాండర్డ్ ఫైర్ వర్స్ పేద్ద మొత్తంలో బేరియని కొనుగోలు చేయడాన్ని సుప్రీం అక్షేపించింది.

ఇక పర్యావరణ హిత బాణాసంచాలుగా సంబంధిత కమిటీలతో అమోదం పోందిన వాటి విక్రయాలను అనుమతిస్తామని తెలిపింది. దేశంలో చట్టాలున్నా వాటి అమలు కష్టతరం అవుతోందని వ్యాఖ్యానించింది. కాగా, బాణసంచా తయారీదారుల సంఘం కూడా తన వాదనలను వినిపించింది. దీపావళి పండుగ దగ్గరకొస్తోందని, టపాసుల విషయంలో పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రత సంస్థ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం లక్షల మంది ఉపాధి లేకుండా ఉన్నారని పేర్కొంది. అయితే, వారి ఉపాధి కోసం ఇతరుల హక్కులను కాలరాయలేమన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles