Did Kothapalli Geetha served Araku as a Guest.? కొత్తపల్లి గీత అరకుకు అతిధిగానే వున్నారా.?

Former mp kothapalli geetha about araku parliament constituency development

Kothapalli Geetha, Kothapalli Geetha news, Kothapalli Geetha updates, Kothapalli Geetha latest, Kothapalli Geetha breaking news, Kothapalli Geetha political career, Kothapalli Geetha wiki, Kothapalli Geetha political journey, Kothapalli Geetha career, Kothapalli Geetha allegations, Kothapalli Geetha MP, Kothapalli Geetha party, Kothapalli Geetha in BJP, Kothapalli Geetha BJP, Kothapalli Geetha: Her Inspirational Journey

Kothapalli Geetha who represented Araku Parliamentary constituency from the now ruling YSRCP party from 2014 to 2019, but the opposition parties critisize her that she served the constituency as a Guest. How does former MP respond on these comments.

ITEMVIDEOS: అరుకు అభివృద్ధిపై మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మనోగతం ఏమిటీ.?

Posted: 09/29/2021 11:06 AM IST
Former mp kothapalli geetha about araku parliament constituency development

అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత.. అరకును అందమైన పర్యాటక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి అత్యధికమంది పర్యాటకులను ఆకర్షించడానికి అద్దాల బోగిని తీసుకువచ్చిన అమె.. అరుకులో పర్యాటకులకు ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండా ఏకంగా రూ.5000 కోట్లతో రోడ్లును కూడా వేయించారు. ఇక దీనికి తోడు అమె పార్లమెంటరీ సభ్యురాలిగా ఎన్నికయ్యే సమయంలో దాదాపుగా 3000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో.. దానిపై దృష్టి సారించిన ఆమె.. అరకులోని దాదాపుగా అన్ని గ్రామాలను విద్యుద్దీకరణ చేయించి ప్రతి పల్లెలో రాత్రి వేళ కాంతులు విరబూసేలా చేశారు.

ఇంతలా అరకు పార్లమెంటు నియోజకవర్గానికి పాటుపడిన ఆమెను అక్కడి అతిథిగా మాత్రమే వచ్చారని విపక్షాలు అరోపించడంపై అమె తనదైనశైలిలో స్పందించారు. అరకులో ఏ పార్లమెంటు సభ్యుడు గెలిచినా అతిథిగానే సేవలను అందించాల్సి వుంటుందని, అందుకు కారణంగా అది మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమని అన్నారు. అటు తెలంగాణ నుంచి అటు ఒడిశా వరకు విస్తరించిన ఈ నియోజకవర్గంలో భద్రాచలం, తూర్పగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఐదు జిల్లాల పరిధిలో ఉందన్నారు. దీనికి తోడు ప్రజాప్రతినిధికి తమ పార్టీతోనో లేక ప్రభుత్వాలతోనే కనెక్టివిటీ ఉండాలంటే అరకు నియోజకవర్గం నుంచి దాదాపుగా 100కిలోమీటర్ల దూరం ఉండాల్సిందేనని అన్నారు.

అంతేకాదు ఓప్రాంతానికి వెళ్తే మరో ప్రాంతానికి కనీసం విషయం తెలియని పరిస్థితి వుంటుందని అమె చెప్పారు. తాను క్యాంపుల కోసం నియోజవర్గంలో తిరిగినా.. మూడు గంటల పనికి దాదాపుగా పన్నెండు గంటల మేర ప్రయాణం చేయాల్సివచ్చేదని అమె తెలిపారు. ఇక నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ ఎంపీ లేరని, ఇకపై కూడా ఉంటారని తాను అనుకోవడం లేదని అన్నారు. ఇక ఒకవేళ అరుకులో ప్రజాప్రతినిధి ఉన్నా ఎక్కడున్నారో ఎవరికీ తెలిసేది కాదని, ఎవరికీ అందుబాటులో ఉండేవారు కూడా కాదన అన్నారు. వైజాగ్, రాజమండ్రీ, విజయనగరం లాంటి ప్రాంతాల్లో నాలుగు కార్యాలయాలను పెట్టి.. వాటిలో అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నలుగురు స్టాప్ ను కూడా ఏర్పాటు చేసి తాను ప్రజలకు అందుబాటులో వున్నానని తెలిపారు.

ఇక పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాల్లో తిరగడం ఇటీవల మొదలు పెట్టారని, కానీ అసలు పార్లమెంటు సభ్యులు తన నియోజకవర్గంలో తిరగాల్సిన పనిలేదని అన్నారు. ఎందుకంటే ఎంపీల ముఖ్యమైన విధులేంటంటే.. తమ నియోజకవర్గాలకు రావాల్సిన నిధులను తీసుకురావడమని అమె అన్నారు. తెచ్చిన నిధులు సక్రమంగా ఉపయోగపడుతున్నాయా అని చూడటమని అన్నారు. ఎంపీలు ఏడాదికి 120 రోజులు పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడం, మరో 60 రోజులు కేంద్రీయ కమీటీ సమావేశాలు హాజరు కావడం.. వీటికి తోడు సెంట్రల్ కమిటీలో వున్న అబ్లిగేషన్స్ కు కూడా హాజరైన తరువాత ఎంపీకి మిగిలేది కేవలం 50 నుంచి 60 రోజులు మాత్రమేనని అన్నారు. అయినా తాను ఏఢాదికి 120 నుంచి 130 రోజులు నియోజకవర్గంలో పర్యటించానని కొత్తపల్లి గీత అన్నారు.

అరకు ప్రజలకు ఇప్పుడు కావాల్సింది స్వయం సవృద్ది.. వారి చుట్టూరా ఉన్న వనరులతో వారు దీనిని సాధించే అవకాశాలు వున్నాయి. అక్కడి పిల్లలు కూడా చాలా తెలివైన వారే అయితే వారి కాళ్లపై వారు నిలబడే పరిస్థితిలేదని అన్నారు. దీంతో తాను అరకు ప్రజల జీవితాల అభ్యున్నతికి విద్యాసంస్థలు సరిగ్గా లేకపోవడమే కారణమని అన్నారు. అయితే అరకులో ఎడ్యూకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేయాలన్నది తన ప్రణాళికగా చెప్పుకోచ్చారు. దీంతో పాటు వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడంతో పాటు యువతను ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు రూపోందించాలని అన్నారు. ఇక అరుకు మరింత అందంగా తయారవ్వాలంటే పరిశ్రామీకరణ జరగాలని.. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తే కానీ అరుకు అభివృద్ది సాధ్యంకాదని కొత్తపల్లి గీత అన్నారు.

అరుకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే కనీన మౌళిక వసతుల కల్పనలోనూ తీవ్రమైన కొరత ఉందని అన్నారు. ఇప్పటికీ తాగునీరు సమస్య ఉందని, స్థానికంగా లభించిన నీరును తాగడం వలన అక్కడి ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారని అమె అన్నారు. అయితే అరోగ్య సౌకర్యాలు కూడా అంతగా అందుబాటులో లేవని అన్నారు. అరుకులో అనేక కుటుంబ అరోగ్య కేంద్రాల అవసరం వుందని, అరోగ్య వసతుల కల్పన కూడా అవసరమని.. ఇక్కడ ఒక్క మల్టీ స్పెషాలిటీ అసుపత్రి కూడా అందుబాటులో లేదని అమె అన్నారు. అరకు ఎంపీ స్థానం లడఖ్ తరువాత అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమని.. ఇందులో ఏకంగా 40 వేల గ్రామాలు వున్నాయని కొత్తపల్లి గీత అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్దికి కనీస వసతులతో ప్రజల్ని కూడా విద్య, అరోగ్య, ఉపాధి వసతుల కల్పన అవసరమని కొత్తపల్లి గీత అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles