Auto driver foils girl's bid to crush herself to death under train యువతి ఆత్మహత్యయత్నాన్ని తప్పించిన ఆటో డ్రైవర్..

Woman attempts to end life by standing on rail tracks brave auto driver saves her

Madhya Pradesh, Suicide, suicide bid foiled, suicide attempt, betul suicide case, mp suicide news, girl suicide, betul girl, betul girl suicide

A disturbing video has surfaced from Madhya Pradesh showing a woman attempting to end her life by standing on railway tracks. Fortunately, the woman was saved as an auto driver prevented the woman from getting hit by a moving train.

యువతి ఆత్మహత్యయత్నాన్ని తప్పించిన ఆటో డ్రైవర్..

Posted: 09/28/2021 09:36 PM IST
Woman attempts to end life by standing on rail tracks brave auto driver saves her

సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఓ ఆటో డ్రైవర్ ఓ నిండు ప్రాణాన్ని బలికాకుండా ఆపగలిగాడు. ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నించిన ఓ యువతి సురక్షితంగా అమెను సజీవంగా వుండేట్టు చేశాడు.రైలుకింద పడి ఆత్మహత్యకు యత్నించేందుకు పూనుకుని వచ్చిన ఓ యువతి రైల్వే గేటు వద్ద ఎదురుచూస్తోంది. ఇంతలో అటువైపుగా రైలు వస్తుండటం చూసి యువతి పరుగులు తీసింది. అయితే పట్టాలకు అవతలి వైపు వెళ్లేందుకు యువతి పరుగు పెట్టిందని అందరూ భావించారు. ఇంతసేపు ఇక్కడే నిల్చుని రైలు వస్తుండగానే అవతలి వైపు అంత అర్జెంటుగా ఎందుకు వెళ్తోందో అని అక్కడున్నవారు అనుకున్నారు.

అయితే అక్కడున్నవారు ఊహించినట్టు కాకుండా యువతి నేరుగా వెళ్లి పట్టాలపైనే నిల్చుంది. దీంతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు. ఏం చేయాలా అని కొందరు అలోచిస్తుండగానే ఓ అటో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. ఆ యువతని ఆత్మహత్యకు పాల్పడకుండా ఆపడంలో అజేయుడయ్యాడు. ఓ నిండు ప్రాణాన్ని బతికించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఓ రైల్వే గేట్ వద్ద చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాల వద్దకు వచ్చింది యువతి.. గేటు వద్ద నిలబడి రైలుకోసం చూస్తుంది.

అదే సమయంలో రైలు వేగంగా వస్తుండటంతో చూసి రైల్వేగేటు దాటి పట్టాలపైకి వెళ్ళిందీ యువతి. ఆమెను గమనించిన ఆటోడ్రైవర్ పరుగుపరుగున వెళ్లి యువతిని లాక్కొచ్చాడు. అయితే ఆమె ఎంతకీ పట్టాల దగ్గరి నుంచి కదలకపోవడంతో మరోవ్యక్తితో కలిసి రైల్వే ట్రాక్ నుంచి పక్కకు తీసుకొచ్చారు.ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది యువతి. దీంతో అక్కడ ఉన్నవారు యువతికి నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువతి కదలికలపై అనుమానం రావడంతో ఆటోలో ఉన్న వ్యక్తి ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Auto Driver  Madhya Pradesh  Rail track  rail tracks  Suicide  train  unemployment  viral video  woman  

Other Articles