Pawan Kalyan takes on AP government ‘‘సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ’’ అంటూ పవన్ కల్యాన్ ట్వీట్

Pawan kalyan takes on ap govt tweeting save ap from ycp

Pawan Kalyan, JanaSena, YSRCP, AP CM YS Jagan, Cinema Tickets, AP Government, Save AP from YCP, Andhra Pradesh, Politics

Actor-politician Pawan Kalyan has criticised the Andhra Pradesh government for the move saying that Save Andhra Pradesh from YSR congress Party, as its promises are not fullfilled.

‘‘సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ’’ అంటూ పవన్ కల్యాన్ ట్వీట్

Posted: 09/27/2021 01:15 PM IST
Pawan kalyan takes on ap govt tweeting save ap from ycp

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఈ అంశంపై పవర్ స్టార్ పవన్ కల్యాన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్లో ఈ అంశంపై స్పందించిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు సినీకార్మికులను ఆదుకునేందుకు ముందుకు రానీ ప్రభుత్వాలు.. సినీమా టికెట్లను మాత్రం అన్ లైన్ ద్వారా విక్రయించే సోమ్ము చేసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రశ్నించారు. పవన్ కల్యాన్ వ్యాఖ్యలను ఏపీ మంత్రలు ఖండించారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వేరని, ప్రభుత్వ పాలన సాగించి రెండున్నరేళ్లు కావస్తున్నా హమీలు పూర్తికాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ మరోమారు విరుచుకుపడ్డారు. ‘సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ’ క్యాప్షన్‌తో ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ రాష్ట్రానికి బలమైన రాజధాని లేదని దుయ్యబట్టారు. రాజధాని విషయంలోనూ ప్రజల మధ్య తీవ్ర గంధరగోళం నెలకొందని, ఈ అంశంపై కోర్టుల్ల కేసులు నెలకొన్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు.

ఇష్టానుసారం ప్రజల మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేసి పాలిస్తే అది సుపరిపాలన అనిపించుకోదని విమర్శించారు. ప్రజలకు మద్యం తాగించి ఆ వచ్చే డబ్బుతో ఎన్ని పథకాలు చేపట్టినా అవి సంక్షేమం అసలే కాదని నిప్పులు చెరిగారు. ‘నవరత్నాలు’ భావితరాలకు నవకష్టాలుగా మారాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు, తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను షేర్ చేస్తూ కటిక నిజాలు ఇవేనని క్యాప్షన్ జత చేశారు. ఏపీ పరిస్థితి ఇలా ఉందంటూ మరో స్నాప్‌షాట్‌ను కూడా షేర్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles