Kothapalli Geetha comments on quiting YSRCP Party వైసీపీలో కొత్తపల్లి గీత ఇమడలేకపోయిందా.? ఎందుకు.?

What lead former mp kothapalli geeta to quit ysrcp party

Kothapalli Geetha, Kothapalli Geetha news, Kothapalli Geetha updates, Kothapalli Geetha latest, Kothapalli Geetha breaking news, Kothapalli Geetha political career, Kothapalli Geetha wiki, Kothapalli Geetha political journey, Kothapalli Geetha career, Kothapalli Geetha allegations, Kothapalli Geetha MP, Kothapalli Geetha party, Kothapalli Geetha in BJP, Kothapalli Geetha BJP, Kothapalli Geetha: Her Inspirational Journey

Former member of Parliament Kothapalli Geetha represented Araku Parliamentary constituency from the now ruling YSRCP party but she didnot sustained in the party. What led her to quit YSRCP party,

ITEMVIDEOS: మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను వైసీపీ పార్టీ పొమ్మనలేక పొగబెట్టిందా.?

Posted: 09/27/2021 04:28 PM IST
What lead former mp kothapalli geeta to quit ysrcp party

డిఫ్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించి.. ప్రజలకు మరింత సేవ చేసేందుకు రాజకీయ అరంగ్రేటం చేసి.. తొలి ప్రయత్నంలోనే పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత.. పార్టీలో తనదైన మార్కు వేసుకుని దూసుకువెళ్లాల్సిన తరుణంలో.. అరుకు నియోజకవర్గం వైసీపీకి అన్నీ తానై నడపించాల్సిన సమయంలో.. పార్టీని వీడి ఎందుకు బయటకు వచ్చారు.? పార్టీలో అమె ఎందుకు ఇమడలేకపోయారా.? ఇందులో పార్టీ నేతల పాత్ర ఏమిటీ.? మరీ అధిష్టానం వైఖరి ఎలా ఉండింది.? లేక పార్టీయే అమెను పోమ్మనలేక పోగబెట్టిందా.? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలేం జరిగిందీ అన్న స్పష్టత కొత్తపల్లి గీత మాటల్లోనే విందాం.

కొత్తగా వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.. పార్టీని బలోపేతం చేస్తూ తాను కూడా ఎదగడానికి.. స్థిరంగా పార్టీలో క్యాడర్ ను వృధ్ది చేసుకునేందుకు దోహదపడుతుందనే ఆ పార్టీలో చేరానని కొత్తపల్లి గీత చెప్పారు. ఇందుకు తన తండ్రి కలెక్టరుగా పనిచేయడం, తాను డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలు నిర్వహించడం కూడా దోహదపడిందని అమె అన్నారు. ఇక దీనికి తోడు రాజకీయాల్లోకి రావాలన్న అలోచన రాకముందే తాను అరకు ప్రాంతంలో గీత సోసైటీని ఏర్పాటు చేసి.. ప్రభుత్వానికి సంబంధం లేకుండా అక్కడి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందించానని తెలిపారు. ఈ సేవలను మరింత విస్తృతం చేయాలన్న యోచనే రాజకీయాల్లోకి వచ్చేలా చేసిందని తెలిపారు.

‘‘తాను ఒకటి తలిస్తే..’’ అన్న చందాన.. పరిస్థితులు నెలకొన్నాయని.. దాంతోనే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని అమె అన్నారు. తాను వైసీపీ పార్టీలో చేరికకు ముందునుంచే పార్టీలో ఉన్న కొందరు నేతలు తన పట్ల వత్యిరేకతను ప్రదర్శించారని అన్నారు. తాను పార్లమెంటు సభ్యురాలిగా పోటీకి కూడా దిగకముందే తనను అవమానించే రీతిలో వ్యవహరించారని, తాను పార్టీ కార్యక్రమాలకు హాజరైనా.. వేదికలపైకి ఆహ్వానించపోవడం, తనకు పార్టీ వేదికలపై ప్రసంగించే అవకాశాలు కల్పించకపోవడం చేశారని అమె తెలిపారు. అయితే ఈ తరహా చర్యలతో తన ఆత్మగౌరవంపై దెబ్బ కోట్టేలా వ్యవహరించారని అరోపించారు. రాజకీయాలంటే ఇలాగే ఉంటాయని చెప్పిన వారు ఉన్నారు.. ఇవన్నీ సహజం అని నిట్టూర్పు విదిల్చినవారు ఉన్నారని అమె చెప్పారు. ఇక  తాను ఎంపీగా ఎలా గెలుస్తానో కూడా చూస్తామని కొందరు వైసీపీ నేతలు సవాల్ చేశారని అమె చెప్పారు,

కాగా, రాజకీయాలకు తాను కొత్త కాబట్టి.. ఇలా జరుగుతుందని సన్నిహితులు చెప్పడంతో తాను సర్థుకుపోయానని, అయితే పార్టీలో ఎంపీగా గెలిచిన తరువాత కూడా పరిస్థితుల్లో మార్పులు రాకపోవడంతోనే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత అత్యధికంగా ఇబ్బందిపడింది తన పార్టీ నేతలతో మాత్రమేనని అమె చెప్పుకోచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సహా వైఎస్ జగన్ కుటుంబంపై కూడా ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైన తరుణంలో తామే వాటిని తీవ్రంగా ఖండించామని చెప్పారు. అలాంటిది తమ మహిళాఎంపీపై సొంత పార్టీ నేతలే నీచమైన విమర్శలు చేస్తున్నా.. తమ బిడ్డలాంటి గీతపై ఇలా ఎందుకు చేస్తున్నారని వారెందుకు ఖండించలేకపోయారని అమె ప్రశ్నించారు. దీంతో పార్టీ అధిష్టానమే కావాలని ఇలా తనను పొమ్మన లేక పోగబెడుతుందా.? అన్న అనుమానాలు ఉత్పన్నమయ్యేలా చేశాయని అమె అన్నారు.

అయితే తానను వైసీపీ నేతలు టార్గెట్ చేయడానికి ముఖ్యకారణం బాక్సైట్ మైనింగేనని అమె అన్నారు. అరుకు ప్రాంతంలో బాక్సైట్ చాలా ఎక్కువని, స్థానికంగా ఉన్న 90శాతం మంది నేతలు ఈ బాక్సైట్ తవ్వకాలపై ఆధారపడినవారేనని అమె అన్నారు. తాను ఢిప్యూటీ కలెక్టర్ గా పనిచేశానని, దీంతో తనకు ఈ బాక్సైట్ మైనింగ్ అంశాలపై చాలా అవగాహన వుందని భావించిన స్థానిక వైసీపీ నేతలు.. తాను పార్టీ ఎంపీగా గెలిస్తే వారి అక్రమ మైనింగ్ కార్యకాలపాలకు అవరోధంగా మారుతానని భావించే వ్యతిరేకించారని చెప్పుకోచ్చారు. దీంతో తనను అవమానిస్తే తాను రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానని వారు భావించే అవమానించారని అన్నారు. అయితే ఎవరు ఎం చేసినా తాను ప్రజలకు చేయాలనుకున్న సేవను తప్పక చేయాలని నిర్ణయించుకుని మరింత ధైర్యంగా ముందుకు వెళ్లానని అమె చెప్పారు.

వైసీపీ పార్టీ ఎంపీగా గెలిచినా.. పరిస్థితుల్లో మార్పులు రాలేదన్న గీత.. ఈ కారణంగానే తాను పార్టీని 2014లోనే వీడి తనకంటూ ప్రత్యేక క్యాడర్ ను ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టానని చెప్పారు. తాను అరుకు పార్లమెంటరీ ప్రజలకు ఎంపీనని, దీంతో పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు తాను సేవలు అందించానని చెప్పారు. అరకు పార్లమెంటరీ సభ్యురాలిగా 2014 నుంచి 2019 వరకు తాను నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలు తనకు అత్యంత సంతృప్తిని అందించాయన్న కొత్తపల్లి గీత.. 70 సంవత్సరాల స్వతంత్రం తరువాత కూడా అందని అందాల గ్లాస్ బోగిని తాను సాధించానని అన్నారు. అరకు అందాలను పర్యాటకులు వీక్షణకు గత 30-35 ఏళ్లుగా ఉన్న డిమాండ్ తన హయాంలో పూర్తి చేశానని అన్నారు. తన హయాంలో ఏకంగా రూ.5000 కోట్లతో రోడ్లను నిర్మాణం చేపట్టానని చెప్పారు. గిరిజన నియోజకవర్గాల అభివృధ్ధి నిధులను కూడా తీసుకువచ్చానని అన్నారు, అరకు అంటే కొత్తపల్లి గీత, గీత అంటే అరకు అనేలా అక్కడి ప్రజలతో మమేకమయ్యానని చెప్పారు. ఇది తన మాట కాదని అక్కడి ప్రజల మాటగా కొత్తపల్లి గీత చెప్పుకోచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles