Bombs Hurled Again Outside BJP MP's Home in Bengal బీజేపి ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వద్ద బాంబు పేలుడు..

Bombs thrown at bjp mp arjun singh s residence near kolkata a week after first attack

Arjun Singh, bombs, bombs hurled at BJP MP House, Jagatdal, North 24 Parganas, Trinamool Congress, West Bengal governor, Jagdeep Dhankhar, kolkata, west bengal, Politics

BJP MP Arjun Singh’s residence near Kolkata was again attacked by bombs on Tuesday, a week after the first incident was reported. An official said that bombs were thrown at the back side of his house around 8:30 am. Reacting to the incident, the parliamentarian said, “Criminals are roaming freely, and the police are working as brokers of Trinamool. But I am not afraid of such attacks, neither will I ever be."

బీజేపి ఎంపీ ఇంటి వద్ద బాంబు పేలుడు.. వారంలో రెండో సారి..

Posted: 09/14/2021 08:46 PM IST
Bombs thrown at bjp mp arjun singh s residence near kolkata a week after first attack

పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌ నివాసం వద్ద మరో బాంబు పేలింది. దీంతో ఆయన నివాసం పరిసరాల్లోని ప్రజలు కూడా భయకంపితులయ్యారు. ఆయన ఇంటికి 200 మీటర్ల దూరంలో ఈ బాంబు విస్పోటనం చోటుచేసుకుంది. ఆయన కుటుంబసభ్యులతో పాటు ఇరుగుపోరుగువారు కూడా భాయందోళనకు గురయ్యా. ఇప్పటికే ఆయన ఇంటి వద్ద వారం క్రితం మూడు క్రూడ్‌ బాంబులు పేలాయి. దీనిపై జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) విచారణ చేపట్టిన 24 గంటల వ్యవధిలోనే మరో బాంబు పేలింది.

పశ్చిమ బెంగాల్‌ ఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని జగదల్‌లోని బారాక్‌పూర్‌ ఎంపీ అర్జున్‌సింగ్‌ నివాసం ఉంటున్నారు. ఈనెల 8 వ తేదీన ఇంటికి సమీపంలోని మైదానంలో మూడు క్రూడ్‌ బాంబులు పేలాయి. దీనికి టీఎంసీయే బాధ్యత వహించాలని అర్జున్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఇలాఉండగా, ఇవాళ ఉదయం 9 గంటలకు మరో బాంబు పేలింది. ఇంటికి సమీపంలోని ఓపెన్‌ ప్లేస్‌లో క్రూడ్‌ బాంబ్‌ పేలింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. టీఎంసీ కార్యకర్తలే ఈ బాంబులను పేలుస్తున్నారని, దీనికి టీఎంసీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అర్జున్‌సింగ్‌ అన్నారు.

టీఎంసీ మద్దతు కారణంగానే నేరగాళ్లు దర్జాగా తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడనన్నారు. భబానీపూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు పరిశీలకుడిగా తనను బీజేపీ నియమించడం వల్ల తనను భయబ్రాంతులకు గురిచేసేందుకే ఇలా బాంబులు పేలుస్తున్నారని అర్జున్‌సింగ్‌ పేర్కొన్నారు. కాగా, బాంబులు వేయలేదని, వాటిని అక్కడి మైదానంలో దాచినట్లు స్థానిక పోలీసులు భావిస్తున్నారు. బాంబు పేలుడుపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మొదటి బాంబు పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ విచారణ ప్రారంభించిన 24 గంటల్లోనే మరో బాంబు పేలడం కాకతాళీయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles