Anand Mahindra ‘amazed’ at Bolero's water-wading ability ఆనంద్ మహీంద్రాను సంభ్రమాశ్చర్యానికి గురిచేసిన వీడియో.!

Anand mahindra is surprised at bolero s water wading potential in heavy rains

Anand Mahindra, Bolero, Rajkot Police, Taluka police, Rains, Rains in Rajkot, Rains in Gujarat, Water loddged Streets in Rajkot, Water loddged Streets in Gujarat, water wadding Bolero, Gujarat, social media, viral video, trending

Anand Mahindra, Mahindra Group chairman, is amazed to see Mahindra Bolero SUV's water-wading potentiality in flooded streets in Rajkot, Gujarat. The 30-second video shows a Bolero deputed in Rajkot Police duty wading through the water where no other cars are seen on the road.

ITEMVIDEOS: ఆనంద్ మహీంద్రాను సంభ్రమాశ్చర్యానికి గురిచేసిన వీడియో.!

Posted: 09/14/2021 05:01 PM IST
Anand mahindra is surprised at bolero s water wading potential in heavy rains

బిజినెస్ టైకూన్.. మహింద్రా అండ్ మహీంద్రా సంస్థ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కొనసాగుతుంటారు. ఇటీవలే ఆయన రీల్ క్రికెట్ కాదు రియల్ క్రికెట్ అంటూ.. ఓ వీడయోను పంచుకున్నారు. టీవిల్లో చిన్నారులు గల్లీ క్రికెట్ ను వీక్షిస్తున్నట్లు కనబడిన వీడియోలో టీవీలోంచి బంతి బయలకు రాగా, చిన్నారులు పట్టుకున్నారు. ఇక పీల్డర్ వచ్చి బంతిని కూడా టీవీలోంచే అడిగి తీసుకోళ్లడం కొసమెరుపు. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రజలను టీవీ తెరలకు ఎలా అతుక్కుపోయేలా చేసిందో ఈ వీడియో చూపుతుందన్న అయన.. తనకు మాత్రం టీవీల్లోంచి దూరివెళ్లి రియల్ క్రికెట్ అడాలని ఉందని కామెంట్ చేశారు.

ఇక తాజాగా ఆయనకు ఓ నెటిజన్ షేర్ చేసిన వీడియోను చూసి సంతోషపడిన ఆయన.. ఆ వీడియోను కూడా తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గుజరాత్‌ లోని రాజ్ కోట్ నగరం నదిని తలపించింది. ఊరా.? చెరువా అన్నట్టుగా అంతా నీటిమయం అయ్యింది. ఆ సమయంలో ఓ మహీంద్రా వాహానంలో పోలీసులు రెస్క్యూ కోసం వెళ్తున్న వీడియోను ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఆ వీడియో చూసిన ఆనంద్‌ మహీంద్రా ఆశ్చర్యపోయారు. నిజంగానా.? ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో తీసిన వీడియోనేనా.? తాను నిజంగా సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను అంటూ క్యాప్షన్‌ జోడించారు.

ఆనంద్‌ మహీంద్రా కామెంట్‌ చేయడంతో నెటిజన్లు ఈ పోస్టుపై తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహీంద్రా వాహనాలు నమ్మకానికి మరో పేరు అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు బ్రాండ్‌ ప్రమోషన్‌ బాగా చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. కాగా బ్రాండ్‌, వాహనం అన్నది ప్రధానం కాదని, అంత వరదలోనూ డ్యూటీ నిర్వర్తిస్తున్న పోలీసులను మెచ్చుకోవాలంటూ మరికోందరు సూచిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఈ వాహానం నీటిలో తేలుతున్నట్లుగా వుందని.. కామెంట్ చేస్తున్నారు.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Seriously? During the recent rains? Even I am pretty amazed. <a href="https://t.co/Co5nve9uwd">https://t.co/Co5nve9uwd</a></p>&mdash; anand mahindra (@anandmahindra) <a href="https://twitter.com/anandmahindra/status/1437621368464547840?ref_src=twsrc%5Etfw">September 14, 2021</a></blockquote>

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles