Taliban seize $6.5 million, 18 gold bricks from Saleh's house అమ్రూల్లా సలేహ్ ఇంట్లో భారీగా నగదు, బంగారం లభ్యం

Taliban claims to recover 6 5 million 18 gold bricks at former afghan vp s home

Taliban, Amrullah Saleh, Panjshir, Afghanistan Crisis, Kabul, Afghanistan, Kabul airport, ISIS-K, Afghanistan-Taliban Crisis, afghan spies, afghanistan crisis, indians in afghanistan, Afghanistan, Afghanistan latest news, Taliban, Taliban latest news, Kabul, Kabul Airport, hindus in afghanistan, hindu temple in afghanistan, taliban, kabul

The Taliban have claimed that they have found $6.5 million and 18 gold bricks during a raid at the residence of former Afghanistan vice-president Amrullah Saleh. The insurgent group made the claims on Twitter, as a local journalist shared a video showing two suitcases stuffed with cash and gold bricks.

అమ్రూల్లా సలేహ్ ఇంట్లో భారీగా నగదు, బంగారం లభ్యం

Posted: 09/14/2021 04:06 PM IST
Taliban claims to recover 6 5 million 18 gold bricks at former afghan vp s home

ఆఫ్ఘ‌నిస్తాన్ ను తమ కబంధహస్తాలలోకి తీసుకున్న తాలిబన్లు.. అక్కడ అధికారాన్ని కూడా అందిపుచ్చుకుని పాలనను కూడా సాగిస్తున్నారు. అయితే తాలిబన్ల పాలనపై నమ్మకం లేని వేలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్తున్నారు. ఇప్పటికే విమానాల్లో విదేశాలకు వెళ్లే స్థోమత కలిగిన వాళ్లు వెళ్లగా, తాజాగా మరికోందరు దేశ సరిహద్దులను దాటేందుకు ఇటు పాకిస్థాన్ అటు ఉజ్బకిస్తాన్, ఇరాన్ దేశాలకు వెళ్లేందుకు సన్నదమై సరిహద్దులకు చేరకున్నారు. అయితే దేశంలో ఇస్లాం చట్టం షరియా మాత్రమే అమలు అవుతుందని చెప్పిన తాలిబన్లు ఇన్నాళ్లుగా కొనసాగిన ప్రజాస్వామ్యం మాత్రం చెల్లదని ఇప్పటికే సంకేతాలు పంపించారు.

ఇక దేశంలో ప్రజలను పాలించేందుకు ఆర్థికంగా బాగా వెనుకబడిన తాలిబన్లు ఇప్పుడు తమ దేశంలోని అక్రమ సంపాదన నిలువున్న ప్రాంతాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పాత ప్రభుత్వంలోని మంత్రులు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. అప్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అష్రప్ సలేహ్ ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేసిన తాలిబన్లకు కొండంత ఆసరా లభించింది. ఆయన నివాసంలో ఏకంగా కట్టల కోద్దీ డబ్బులు బయటపడ్డాయి. సుమారు 6 మిలియన్ల విలువ చేసే డాలర్లు(మన కరెన్సీలో 45 కోట్ల రూ. దాకా), 18 పెద్ద బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.

అఫ్గనిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ  దేశం విడిచి పారిపోయిన తర్వాత.. అమ్రూల్లా సలేహ్‌ తనను తాను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఆపై తాలిబన్ల ఆక్రమణ తర్వాత అజ్ఞాతంలో ఉంటూ.. తాలిబన్లతో పోరాటం కొనసాగుతుందని ప్రకటించాడు కూడా. పంజ్ షీర్ లో తలదాచుకున్న ఆయన అక్కడి బలగాల భద్రతలో కొన్ని రోజులు ఉన్న ఆయన.. తమ బలగాలు పట్టు కోల్పోతున్నాయని తెలియగానే విదేశాలకు వెళ్లిపో్యాడు. అయితే ఆయన ఇంట్లో తాజాగా సోదాలు నిర్వహించాగా భారీ అక్రమార్జన లభించిందని తాలిబన్‌ మల్టీమీడియా బ్రాంచ్‌ చీఫ్‌ అహ్మదుల్లా ముట్టాఖీ తన ట్విటర్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశాడు.  

ఇక సలేహ్‌తో పాటు ఆయనకు అనుకూలంగా పని చేసిన మంత్రులు, అధికారులు, గత పాలనలో అవినీతికి పాల్పడ్డవాళ్ల ఇళ్లలోనూ తాలిబన్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా సోమ్ము సేకరించినట్లు తెలుస్తోంది. ఇక పరారీలో ఉన్న మరికొందరి దగ్గర సొమ్ము ఉండొచ్చని భావిస్తున్న తాలిబన్లు.. ఓ లిస్ట్‌ తయారు చేసుకుని వెతుకుతున్నారు.  ఇదిలా ఉంటే అఫ్గనిస్తాన్‌ను తాలిబనిస్తాన్‌గా మారడం తనకు ఇష్టం లేదని ప్రకటించుకున్న సలేహ్‌.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత పంజ్‌షీర్‌కు పారిపోయాడు. అక్కడ ప్రతిఘటన దళాల నేత అహ్మద్‌ మస్సౌద్ తో కలిసి పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో సలేహ్ సోదరుడు రుల్లాహ్‌ను బంధించి, చిత్రహింసలు పెట్టి మరీ చంపారు తాలిబన్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh