Jubilee Hills has the best air quality in Hyderabad నగరంలోని ఈ ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి లభ్యం

Jubilee hills and uppal has the best air quality in hyderabad

Quality Air in jubilee hills, Quality Air,in Uppal, Quality Air, in BHEL, Jubilee Hills, Uppal, Telangana State Pollution Control Board (TSPCB), Quality Air, Air Quality Index (AQI), Balanagar, Charminar, Paradise, Hyderabad, Telangana

According to the Air Quality Index (AQI) report by the Telangana State Pollution Control Board (TSPCB) released a few days ago, Jubilee Hills has the best air quality in the city now and in fact, is one of the two areas in the city that recorded ‘good’ air quality, with the other being Uppal.

హైదరాబాద్ లో స్వచ్ఛమైన గాలి ఎక్కడ లభిస్తుందో తెలుసా.!

Posted: 09/14/2021 03:15 PM IST
Jubilee hills and uppal has the best air quality in hyderabad

వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలు తీస్తోంది. వారిని శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా గురిచేస్తోంది. ఈ క్రమంలో స్వచ్ఛమైన గాలి పీల్చ‌డం గ‌గ‌న‌మవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో వాహనాల కాలుష్యమే అధికం. ఒకప్పుడు పారిశ్రామిక వాడల కారణంగా హైదరాబాద్ సిటీలో వాయుకాలుష్యం తీవ్రత అధికంగా వుండేది. అయితే ఇప్పుడు కాలుష్య పరిశ్రమలను జిల్లాలకు తరలించిన కారణంగా నగరంలో వాయుకాలుష్య తీవ్రత కొంత అదుపులోకి వచ్చింది. అయినా వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో వాటి నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా వాయు కాలుష్యం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.  

కాగా న‌గ‌రంలోని కొన్ని ప్రాంతాల్లోనే స్వ‌చ్ఛ‌మైన గాలి ల‌భిస్తుంది. ఔనా.. ఆ ప్రాంతాలు ఏవీ అంటారా.. జూబ్లీహిల్స్, మ‌రొక‌టి ఉప్ప‌ల్ అని తేలింది. కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి (టీఎస్పీసీబి) విడుద‌ల చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) రిపోర్టులో ఈ విష‌యం వెల్ల‌డి అయింది. సిటీలోనే నాణ్య‌మైన గాలి ల‌భించేది జూబ్లీహిల్స్ అని ఆ నివేదిక‌లో పేర్కొన్నారు. ఉప్ప‌ల్ ఇండ‌స్ర్టియ‌ల్ ఏరియా అయిన‌ప్ప‌టికీ అక్క‌డ కూడా గుడ్ ఎయిర్ క్వాలిటీ ఉంద‌ని తెలిపారు. సెప్టెంబ‌ర్ 7వ తేదీన‌ జూబ్లీహిల్స్, ఉప్ప‌ల్‌లో 30 నుంచి 50 మ‌ధ్య గాలి నాణ్య‌త‌ న‌మోదైంది.

సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో జూబ్లీహిల్స్‌లో గాలి నాణ్యత గుడ్ లెవ‌ల్‌లో ఉంది. ఇదే స‌మ‌యంలో ఉప్ప‌ల్‌లో గాలి నాణ్య‌త సంతృప్తిక‌రంగా ఉంది. ఈ రెండు ఏరియాల‌తో పాటు బాలాన‌గ‌ర్‌, ప్యార‌డైజ్, చార్మినార్ ప్రాంతాల్లో గాలి నాణ్య‌త సంతృప్తిక‌రంగా ఉంది. జీడిమెట్ల‌లో గాలి నాణ్య‌త‌లో ఎలాంటి మార్పు లేదు. గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే దాన్ని గుడ్ అని పరిగణిస్తారు. 51-100 మధ్య ఉంటే సంతృప్తికరమని.. 101-200 మధ్య ఉంటే ఓ మాదిరి అని.. 201-300 మధ్య ఉంటే పూర్ అని.. 301-400 మధ్య ఉంటే వెరీ పూర్.. 400 లోపు ఉంటే తీవ్రమని పేర్కొంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jubilee Hills  Uppal  TSPCB  Quality Air  Air Quality Index (AQI)  Balanagar  Charminar  Paradise  Hyderabad  Telangana  

Other Articles