Love and narcotic jihad exists in Kerala, claims Catholic Bishop నార్కోటిక్స్‌ జిహాద్ తో జాగ్రత్తా: కేర‌ళ బిష‌ప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

They re killing non muslims kerala bishop courts controversy with church address

Love jihad, Narcotic Jihad, jihadists, religious conversion, Christians, Kuruvilangad, Kottayamdestructive activities, terrorism, Pala Bishop, Mar Joseph Kallarangatt, Syro Malabar Church, church celebration, Kuruvilangad, Kerala, Crime

A Catholic bishop on Thursday triggered a controversy, saying that Christian girls were largely falling prey to "love and narcotic jihad" in Kerala and wherever arms cannot be used, extremists were using such methods to destroy the youth belonging to other religions.

ల‌వ్ జిహాద్ త‌ర్వాత నార్కోటిక్స్‌ జిహాద్ : కేర‌ళ బిష‌ప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Posted: 09/09/2021 12:19 PM IST
They re killing non muslims kerala bishop courts controversy with church address

ఓ వర్గానికి చెందిన యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని తమ మతంలోకి మార్చుకుని పెళ్లి చేసుకుని వారిని అనేక ఇబ్బందులకు గురిచేసే చర్యే ల‌వ్ జిహాద్. చాపకింద నీరులా గత కొన్నేళ్లుగా ఈ ట్రాప్ సాగిందన్న ఆరోపణలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా లవ్ జీహాద్ తరువాత ప్ర‌స్తుతం నార్కోటిక్ జిహాద్‌కు క్రైస్త‌వ బాలిక‌లు బ‌ల‌వుతున్నార‌ని కేర‌ళ పాస్ట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొట్టాయం జిల్లా కురువిలంగ‌డులోని చ‌ర్చి వేడుక‌ల్లో సైరో మ‌ల‌బార్ చ‌ర్చ్ బిష‌ప్ మార్ జోసెఫ్ క‌ల్ల‌రంగ‌ట్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

క్రైస్త‌వ బాలిక‌ల‌ను ఉగ్ర ఉచ్చులోకి లాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారు ఆయుధాలు ప్ర‌యోగించ‌లేని చోట నార్కోటిక్స్‌ను వాడుతున్నార‌ని అన్నారు. ల‌వ్ జిహాద్‌లో యువ‌తుల‌ను ప్రేమ పేరుతో ఆక‌ట్టుకుని మ‌తం మార్చేవార‌ని, తాజాగా క్రైస్త‌వ యువ‌త‌లో డ్ర‌గ్స్ వాడ‌కం తీవ్ర‌మైంద‌ని ఇక్క‌డ ముస్లిమేత‌రులు ఎవ‌రూ ఉండ‌కూడ‌ద‌నే ఇదంతా చేస్తున్నార‌ని, అంద‌రూ అలాంటి గ్రూపుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని బిష‌ప్ హెచ్చ‌రించారు. ఐఎస్ శిబిరాల్లో ఇత‌ర మ‌తాల మ‌హిళ‌లు ఎందుకు ఉన్నారో అంద‌రూ ప‌రిశీలించాల‌ని కోరారు. డ్ర‌గ్స్‌తో క్రైస్త‌వ బాలిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని వీరి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు.

ముస్లిం ఆలోచ‌నా స‌ర‌ళిని వ్యాప్తి చేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్ధ‌లో కేర‌ళ నుంచి ప‌లువురు చేరుతున్నార‌ని 2016లో తొలుత వార్త‌లు వ‌చ్చాయి. 19 మంది గ‌ల్లంతైన వారు ఈ ఉగ్ర‌సంస్ధ‌లో చేరార‌ని వారి కుటుంబ స‌భ్య‌లు, బంధువులు పేర్కొన‌డంతో విచార‌ణ చేప‌ట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, ఎన్ఐఏ వంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్ధ‌ల‌ను కోరింది. కాస‌ర్‌ఘ‌డ్‌, ప‌ల‌క్కాడ్ జిల్లాల‌కు చెందిన ఈ 19 మందిలో అత్య‌ధికులు క్రైస్త‌వ, హిందూ మతాల‌ నుంచి ఇస్లాం స్వీక‌రించిన వారు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles