Minister Jayaram interesting comments on Liquor sales చర్చనీయాంశంగా మద్యం విక్రయాలపై మంత్రి జయరాం వ్యాఖ్యలు,,

Minister gummanur jayaram sensational comments on liquor sales

Gummanur Jayaram, Excise Department, employment minister, Labour minister, CM YS Jagan, partial ban on liquor, Liquor sales, Andhra Pradesh, Poitics

After a warning conversation to a Sub-Inspector to release the detained sand tractors has gone viral and is making rounds on social media, Now the comments on Liquor sales of Labour Minister Gummanur Jayaram has become the hot topic.

చర్చనీయాంశంగా మద్యం విక్రయాలపై మంత్రి జయరాం వ్యాఖ్యలు,,

Posted: 09/09/2021 01:10 PM IST
Minister gummanur jayaram sensational comments on liquor sales

రాష్ట్రంలో అంచెలవారి మధ్యనిషేధాన్ని అమలు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు హామినిచ్చిందన్న విషయాన్ని మరిచారో,, ఏమో తెలియదు కానీ రాష్ట్రకార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాత్రం మద్యంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అధికారంలోకి వచ్చి రమారమి రెండేళ్లు దాటినా.. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని అయితే దానికి తానేం చేయాలని, తాగేవాడిని మనం మార్చలేమని ఆయన అన్నారు. రాష్ట్రంలో మద్యనిషేధం చేస్తామని చెప్పిన ప్రభుత్వంలోని మంత్రిగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మంత్రి అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇసుక ట్రాక్టర్లను వదిలిపెట్టాలంటూ ఇటీవల ఎస్సైని బెదిరించిన మంత్రి ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఈ ఆరోపణలపై సీఎంకు వివరణ ఇచ్చేందుకే కలిశారా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఈ విషయం సీఎంకు తెలియదన్నారు. అయినా, దందాగిరి చేసేందుకు వీరప్పన్‌లా ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేశానా? అని ఎదురు ప్రశ్నించారు. మట్టి తోలుకున్నాక తిరిగొస్తున్న ఖాళీ ట్రాక్టర్లను ఎస్సై పట్టుకుంటే అవి రైతులవని, వదిలేయమని చెప్పిన మాట వాస్తవమేనని అన్నారు. తాను దురుసుగా ప్రవర్తిస్తే తప్పని అన్నారు. తానేమీ.. ‘‘ఏయ్ ఎస్సై, ఇసుక ట్రాక్టర్లను వదలండి’’ అని అంటే తప్పని, కానీ అలా అనలేదని అన్నారు.

మద్యం గురించి మాట్లాడుతూ.. తాగేవాడిని తాగొద్దు, ఆరోగ్యాలు పాడుచేసుకోవద్దని, కుటుంబాలు దెబ్బతింటాయని చెబితే ఎవరూ పట్టించుకోరని అన్నారు. అన్ని పథకాలకు డబ్బులు ఇస్తున్న సీఎం.. తాగేందుకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని అడుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. తాగేవాడిని మనం మార్చలేమని అన్నారు. తన దురదృష్టం కొద్దీ తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉందని, అరకిలోమీటరు దూరంలో ఉన్న అక్కడి నుంచి తెచ్చుకుని మరీ మద్యం తాగుతున్నారని, మద్యం ఏరులై పారుతోందంటే తానేం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అదే పనిగా వారిని కాచుకుని కూర్చోలేం కదా..? అని మంత్రి జయరాం పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles