TTD Board good news to Tirumala SriVari Devotees తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

Ttd board good news to tirumala srivari devotees issues free darshan tickets

TTD, Srivari darshan September tickets, Sarva darshanam tickets, September free darshan tickets, Sarva darshanam free tickets, Tirumala, Tirumala News, TTD, Tirumala tirupati Devasthanam, TTD Board, TTD Chairman, Laddu prasadams, Andhra pradesh, politics

Tirumala Tirupati Devasthanam Board sends good news to Tirumala SriVari Devotees, by issuing free darshan (sarva darshanam) Tickets as a pilot project to chitoor devotees. The free tickets quota is limited to 2000 devotees daily. TTD said it will extends the tickets following covid protocol.

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. సామాన్య భక్తులకు ఊరట

Posted: 09/07/2021 09:01 PM IST
Ttd board good news to tirumala srivari devotees issues free darshan tickets

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. గత కొన్ని నెలలుగా ఏడుకొండలు ఎక్కినా శ్రీవారి దర్శనభాగ్యం కలగని భక్తులకు ఇకపై కాసింత ఊరట లభించనుంది. అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రేపట్నించి కేవలం స్వల్ప సంఖ్యలో జిల్లా వాసులకు మాత్రమే శ్రీవారి సర్వదర్శనం టోకన్లు అందించనుంది. ఈ నెల 8వ తేదీ (బుధవారం) నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపిన తిరుమల తిరుపతి దేవస్తానం బోర్డు.. ఇక్కడో మెలిక కూడా పెట్టింది.

గత కొద్దిరోజులుగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు తలొగ్గిన దేవస్థానం బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి రోజుకు రెండువేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లోని టోకెన్లు జారీ చేస్తారని టీటీడీ పేర్కొంది. అయితే, ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులకు మాత్రమే ఈ అవకాశం కల్పించినట్లు చెప్పింది. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ టోకెన్లు పొందేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞపి చేస్తోంది.

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో దేవస్థానం సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెన్లను మాత్రమే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తోంది. చాలా రోజులుగా సామాన్య భక్తులు స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు పడుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని కోరుతూ వస్తున్నారు. ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తుండడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles