Couple Had A Beer Boy At Their Wedding ఇలాంటి అబ్బాయిలుంటే.. ప్ర‌తి పెళ్లిలోనూ అతిథుల‌కు పండుగే..

Couple use beer boy for their wedding instead of flower girl

Christian wedding, tiktok video on beer boy, flower girl ditched in wedding, traditional flower girl missing, TikTok by Brendan DekempTikTok by Brendan Dekemp, Beer boy, wedding, TikTok, Brendan, Beer boy walks down aisle, Beer boy flower girl, Beer boy at wedding, viral video, trending video, video viral

A short clip of the beer boy handing over beer cans to the wedding attendees was shared on TikTok by Brendan Dekemp, who was the groom on the occasion. One of the most important duties of a Christian wedding is attached to the flower girl. Traditionally a young, she has to scatter flower petals down the aisle during the wedding procession.

ITEMVIDEOS: ఇలాంటి అబ్బాయిలుంటే.. ప్ర‌తి పెళ్లిలోనూ అతిథుల‌కు పండుగే..

Posted: 09/07/2021 08:19 PM IST
Couple use beer boy for their wedding instead of flower girl

సాధార‌ణంగా పెళ్లికి వచ్చిన అతిథుల‌కు ఘనంగా స్వాగతం పలుకుతూ వారికి వెల్ క‌మ్ డ్రింక్ లేదంటే మంచినీళ్లు ఇచ్చి మ‌ర్యాద చేస్తుంటారు పెళ్లి పెద్ద‌లు. అది సంప్ర‌దాయం. పెళ్లి త‌ర్వాత ఎలాగూ భోజ‌నాలు ఉంటాయి. అయితే.. మన తరహాలోనే విదేశాల్లోనూ ఆచారాలు వుంటాయి. అక్కడ మరీ ముఖ్యంగా క్రిస్టియ‌న్ పెళ్లిళ్ల‌లో ఫ్ల‌వ‌ర్ గ‌ర్ల్స్ ను ఏర్పాటు చేస్తుంటారు. ఇలానే ఫ్లవర్ గాళ్స్ ఉంటారని ఓ పెళ్లికి వచ్చిన అతిధులకు వాళ్లు కనిపించలేదు. అయితే వారి స్థానంలో కనిపించిన ఓ వ్యక్తి మాత్రం అతిథులకు పానీయాలను అందిస్తూ.. పానీయం నిరాకరించిన వారిపై పూలను చల్లుతూ కనిపించాడు.

అనదిగా విదేశాలలోని పెళ్లివేడుకలలో ఫ్లవర్ గాళ్స్ ఉండటం సంప్రదాయంగా వస్తోంది. కానీ ఆ సంప్రదాయానికి ఈ పెళ్లి చేసుకుంటున్న జంట బ్రేక్ చేశారు. ఇక ప్లవర్ గాల్స్ అంటే..ముద్దుముద్దుగా వుండే పదేళ్ల లోపు చిన్నారులకు పెళ్లి కూతురు తరహాలో తెల్లని దుస్తుల్లో అతిధులపై పూలను చల్లుతుంటారు ఫవ‌ర్ గ‌ర్ల్స్. వీరు కూడా పెళ్లి కూతురు లేదా పెళ్లికొడుకుకు సంబంధించిన వాళ్లు మాత్రమే అయ్యివుంటారు. పెళ్లి జ‌రుగుతున్న స‌మ‌యంలో.. పూల‌ను అతిథుల మీద జ‌ల్లుతూ ఉంటారు. అది అక్క‌డి ఆచారం. కానీ.. ఈ పెళ్లిలో పానీయాలు అందించే బీర్ బాయ్ కనిపించాడు.

ఓ డ‌బ్బా ప‌ట్టుకొని.. బీర్ తాగేవాళ్లకు బీర్ టిన్స్ అందిస్తూ.. బీర్ తాగ‌ని వాళ్ల మీద పూలు చ‌ల్లుతూ వెడ్డింగ్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు. ఈ వీడియోను పెళ్లికొడుకు బ్రెన్ డన్ త‌న టిక్ టాక్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీంతో నెటిజనుల నుంచి కూడా మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు సంప్రదాయానికి వీడ్కోలు పలకడం బాగోలేదనగా, అబ్బ‌.. మ‌నం వెళ్లే ప్రతీ పెళ్లిలోనూ బీర్ బాయిస్ ఉంటే ఉంటే ఎంత బాగుండు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. నా పెళ్లికి నేను ఇలాగా చేస్తా.. అని చెప్పి కొంద‌రు నెటిజ‌న్లు చిలిపిగా రిప్ల‌యి ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles