HC questions govt on measures taken up for Ganesh immersion సమస్యలపై మీకు పట్టదా.?: సర్కారుపై హైకోర్టు మండిపాటు

High ccurt serious on telangana govt questions on measures taken up for ganesh immersion

Telangana High Court, Telangana HC, TS High Court, Ganesh Immersion, GHMC, Hussian sagar, Environment Pollution, Covid-19 Protocol, advocate Venu Madhav, public gathering, Crime

The Telangana High Court on Tuesday questioned the state government on its stand on Ganesh immersion in the view of COVID-19 and prevent environment pollution. It also dissatisfied over the GHMC on submission of report on Ganesh immersion 10 minutes before hearing.

సమస్యలపై మీకు పట్టదా.?: సర్కారుపై హైకోర్టు మండిపాటు

Posted: 09/07/2021 03:42 PM IST
High ccurt serious on telangana govt questions on measures taken up for ganesh immersion

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వినాయక నిమజ్జనాలు, పండుగ ఏర్పాట్ల వ్యవహారంలో తలెత్తే సమస్యలపై మీకు అసలు పట్టదా అని కోర్టు మండిపడింది. న్యాయస్థానం ఆదేశించినా నివేదికలను సమర్పించరా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. విచారణకు పది నిమిషాల ముందు నివేదికలు సమర్పిస్తారా.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత తీరిక లేకుండా ఉన్నారా? అంటూ ఫైర్ అయ్యింది. అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు జీహెచ్ఎంసీ అధికారులపై మండిపడింది.

హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించాలని కోరుతూ గతంలో మామిడి వేణుమాధవ్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి. వినోద్ కుమార్ ల ధర్మాసనం ఇవాళ విచారించింది. నిమజ్జన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేనట్టుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమజ్జన ఆంక్షలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హోల్డ్ లో పెట్టింది. విచారణకు పది నిమిషాల ముందు నివేదికలు ఇవ్వడం పట్ల జీహెచ్ఎంసీపై అసహనం వ్యక్తం చేసింది. నివేదిక ఇచ్చేంత తీరిక కూడా పోలీస్ కమిషనర్ కు లేదా? అని నిలదీసింది.

కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. పండుగకు జనం గుంపులుగా ఉండకుండా చర్యలేం తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే, 48 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేశామని, మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్పిన సమాధానంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సలహాలు ఇవ్వడం కాదని, చర్యలు కావాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని, తామే ఆదేశాలు ఇస్తామని తేల్చి చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles