Nipah virus: Centre suggests measures to Kerala కేరళలో దడ పుట్టిస్తున్న నిఫ్ఫా వైరస్

Nipah virus centre suggests measures to kerala more contacts of boy identified

Kerala Nipah virus, Nipah virus, Kozhikode Medical College, Kozhikode, nipah virus, nipah virus news, kerala nipah virus, Kozhikode nipah virus, health ministry, veena george, central government, National Centre for Disease Control, bats, pigs, contaminated foods, human-to-human, Kerala

The samples of eight people who came in contact with a 12-year-old boy who died of Nipah virus infection in Kerala has returned negative, state Health Minister Veena George said today. The samples were sent to the National Institute of Virology (NIV) in Pune.

నిఫ్ఫా వైరస్: బాలుడితో సన్నిహితంగా మెలిగిన 8మందికి నెగిటివ్

Posted: 09/07/2021 02:52 PM IST
Nipah virus centre suggests measures to kerala more contacts of boy identified

ప్రపంచ వ్యాప్తంగా ఏడాదిన్నర క్రితం వెలుగుచూసి కరోనా మహమ్మారి దాని ప్రభావంతో లక్షలాధి మందిని బలి తీసుకోగా, కోట్లాది మందిన తన బారిన వేసుకుంది. కాగా ఈ మహమ్మారి దేశంలోని కేరళలో మాత్రం ఇంకా విజృంభిస్తూనే వుంది. దీని బారిన పడకుండా వుండేందుకు అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్న తరుణంలో ఇంకోవైపు నుంచి మరో మహమ్మారి వెలుగుచూసింది. గబ్బిలాలు, పందులు, కుళ్లిపోయిన ఆహారపదార్థాలతో పాటు మనిషి నుంచి మనిషికి నేరుగా కూడా వ్యాప్తిచెందే నిఫ్ఫా వైరస్ కేరళలలో దడ పుట్టిస్తోంది.

కేరళ రాష్ట్రవాసులకు కంటి మీద కునుకు కరువయ్యేలా రేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశఆఖ బృందాలు కూడా ఈ విషయమై కేరళ ఆరోగ్యమంత్రిత్వశాఖకు పలు సూచనలు చేశాయి. వైరస్‌ల దాడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాకుండా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. కోజికోడ్ లో నిఫ్ఫా వైరస్ తో ఓ 12ఏళ్ల బాలుడు మరణించాడని సమాచారంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా అప్రమత్తం అయ్యింది. ఈ నేపథ్యంలో బాలుడితో సన్నిహితంగా మెలిగిన మొత్తం 251 మందిని అధికారులు గుర్తించి వారిని ఐసోలేట్ చేశారు.

అయితే బాలుడికి సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, మొత్తం 251 కాగా, వారిలో 129 మంది నర్సులు, వైద్యులు కాగా.. మిగతావారు కుటుంబసభ్యులతో పాటు సన్నిహితులు, బంధువులు కావడం గమనార్హం. వారిలో మృతిచెందిన బాలుడికి అత్యంత దగ్గరగా ఉన్న 38 మందిని కోజికోడ్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఉంచారు. తాజాగా 11 మందికి నిఫా లక్షణాలు గుర్తించడంతో మరింత అప్రమత్తమయ్యారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. వారిని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే శాంపిళ్లు సేకరించి ఫూణేలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా ఇవాళ నివేదికలు వచ్చాయి.

కాగా ఈ నివేదికలో శాంపిళ్లు పంపిన 8 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చిందని కేరళ అరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇది తమకు ఊరటనిచ్చే అంశమని తెలిపారు. ఇదిలావుండగా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సౌజన్యంతో కోజికోడ్ లోనే ఏర్పాటు చేసిన ఓ ల్యాబ్ లో మరో ఐదుగురికి పరీక్షలు నిర్వహించామని వారి శాంపిళ్ల రిపోర్టులు త్వరలో వస్తాయని తెలిపారు ఆమె తెలిపారు. బాలుడి తల్లి జ్వరంతో బాధపడుతున్నారని మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. వారింట్లో వున్న రెండు మేకల శాంపిళ్లను కూడా సేకరించామని వాటిని కూడా పరీక్షించనున్నట్లు తెలిపారు.

కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీలో నిఫా బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశామని చెప్పారు. కేరళకు చేరుకున్న కేంద్ర నిపుణుల బృందం బాలుడి ఇంటిని, ఆ చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించింది. అతడికి నిఫా వైరస్‌ రాంబుటాన్‌ పండు ద్వారానే సోకి ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. దీంతో ఇంటికి సమీపంలో ఉన్న ఆ పండ్లను కూడా సేకరించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సారిగా 2018లో కేరళలోని కోజికోడ్‌లో నిఫా వైరస్‌ బారినపడిన 17 మంది చనిపోయారు. ఇప్పుడు మరోసారి విజృంభణతో జనం టెన్షన్ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles