Re-opening of Schools draws 40% attendence పునఃప్రారంభంమైన విద్యాసంస్థలు.. 40శాతం మంది హాజరు.!

40 percent attendence drawn on first day of reopening schools education minister

Sabitha Indrareddy, 40 percent attendence, Telangana High Court, Telangana Government, Schools, Schools Reopen, Educational Institutions, Corona Third wave, CM KCR, Sabitha Indrareddy, Public Interest Litigation, PIL, Coronavirus, Educational institutions, Educational institutions in Telangana, Telangana

Telangana government has decided to reopen schools and colleges in Telangana only after considering demands of parents and keeping in mind the psychological conditions of students. Many parents have complained that they are compelled to sit with their children during online classes and many students are not able to understand lessons during online classes.

తెలంగాణలో పునఃప్రారంభంమైన విద్యాసంస్థలు.. 40శాతం మంది విద్యార్థులు హాజరు.!

Posted: 09/01/2021 12:22 PM IST
40 percent attendence drawn on first day of reopening schools education minister

రాష్ట్రంలోని విద్యాసంస్థలతో పాటు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని పాఠశాలలను ప్రత్యక్ష విద్యాబోదనను నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారి చేసిన ఉత్తర్వులమేరకు ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు, పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. పలు పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు గేట్లకు మామిడి ఆకులు, వేప అకులతో తోరణాలు కూడా కట్టారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులను తరగతి గదులకు అనుమతించారు. మాస్కులు ధరించి తరగతులకు హాజరయ్యారు. పాఠశాలల్లో అధికారులు, యాజమాన్యాలు శానిటైజర్లు ఏర్పాటు చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు పెద్దసంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కోనరావుపేట మండల వ్యాప్తంగా స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు.. విద్యార్థుల ఉష్ణోగ్రతలు పరిశీలించి, శానిటైజర్‌ ఇచ్చిన తర్వాత తరగతిలోకి అనుమతించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని సురారం కాలనీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొవిడ్ నిబందలను పాటిస్తూ విద్యార్థులు వచ్చారు. తరగతిగదిలో నియమాలను పాటించాలని సైన్ బోర్డులు, శానిటైజర్‌లను ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో పాఠశాలలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని మల్యాలో ఉన్న జూనియర్‌ కాలేజీని తోరణాలతో ముస్తాబు చేశారు.

మహబూబాబాద్ జిల్లా గుమ్ముడూరు మండలంలోని బాలికల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అందంగా అలంకరించారు. కొబ్బరి, అరటి ఆకులతో తోరణాలు కట్టి స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. మహబూబాబాద్‌ పట్టణంలో ఉన్న ప్రైమరీ స్కూల్‌లో విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. మున్సిపల్‌ కమిషనర్‌ విద్యార్థులకు గులాబీ పూలు అందించారు. కాగా, కరోనా మహమ్మారి రెండు ధఫాలుగా విరుచుకుపడిన అనంతంరం రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. స్కూళ్లల్లో పారిశుధ్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించామని, ప్రార్థన సమయంలోనే జాగ్రత్తలు గుర్తు చేయాలని వెల్లడించారు. రాష్ట్రంలోని 60 లక్షల మంది విద్యార్థుల్లో సుమారు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఒకటో తరగతిలో అదనంగా లక్ష మంది విద్యార్థులు చేరారని వెల్లడించారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 2.5 లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles