Price of domestic LPG cylinder hiked by Rs 25 మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. సామాన్యుల పాలిట గుదిబండ.!

Domestic lpg cylinder rates hiked by rs 25 for 3rd straight month

LPG cylinder price hike, LPG price hiked, Cooking gas price hike, cooking gas price, cooking gas price news, lpg cylinder latest rates, lpg gas price, lpg full form, lpg price in Mumbai, lpg gas, lpg price in Pune, lpg gas price today, lpg gas price today Mumbai, lpg cylinder price, lpg subsidy, lpg price

The price of domestic LPG cylinders has been hiked by Rs 25. After the hike, a 14.2-kilogram cooking gas cylinder will cost Rs 884.50 in Delhi. LPG cylinder rates have increased by an equal amount in other parts of the country. State-run oil companies have increased cooking cylinder prices by Rs 25 for the third straight month. LPG cylinder price was earlier hiked by Rs 25 in July and August, respectively. In just 3 months, domestic cooking gas cylinder rates have gone up by Rs 75.

మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. సామాన్యుల పాలిట గుదిబండ.!

Posted: 09/01/2021 01:12 PM IST
Domestic lpg cylinder rates hiked by rs 25 for 3rd straight month

ఇంధన ధరలను ప్రపంచ మార్కెట్ కు అనుగూణంగా రోజువారీగా ధరలను మార్చుతున్న చమురు సంస్థలు.. గ్యాస్ ధరలను మాత్రం పక్షం రోజులకో పర్యాయం సమీకరిస్తున్న సంస్థలు తాజాగా మరోమారు గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుని వినియోగదారులకు షాక్ ఇచ్చింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలను పక్షం రోజుల్లో రెండో పర్యాయం పెంచగా, గత మూడు నెలలుగా మూడు పర్యాయలు పెంచుతూ ఇంధన సంస్థలు గ్యాస్ సిలిండర్ వినియోగదారులపై గుదిబండను వేశాయి. ఈ క్రమంలో తాజాగా సబ్సీడీ గ్యాస్ సిలిండర్ పై రూ.25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే కమర్షియల్‌ సిలిండర్‌పై 75 రూపాయల వరకు పెంచింది.

గ్యాస్ ధరలను ఇవాళ మరోపర్యాయం సమీక్షించిన ఆయిల్ కంపెనీలు ధరల పెంపు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. తాజా ధరల ప్రకారం.. ఇక 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.912 ఉండగా, ఇక ఢిల్లీలో ధర రూ.884, అలాగే కోల్‌కతాలో రూ.886.50, ముంబైలో రూ.859.50, చెన్నైలో రూ.-875.50 ఉంది. ధరలు పెరగడంతో గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం 15 రోజుల్లోనే ఇది రెండో సారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694గా ఉండేది. ఇప్పుడు రూ.884కు చేరింది.

గత ఏడేళ్ల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు కావడం సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతోంది కేంద్రం. 2014 మార్చి నెలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.410 వద్ద ఉండేది. అదేసమయంలో ఈరోజు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.75 పైకి కదిలింది. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. సిలిండర్ బుకింగ్,  డెలివరీ బాయ్ తీసుకునే  చార్జీ కలుపుకొంటే దాదాపుగా రూ.1000 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.1000 పెడితే కానీ గ్యాస్ సిలిండర్ లభించని పరిస్థితి నెలకొంది. ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరగడంతో సామాన్యులకు భారీగా మారిపోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles