India logs 41,965 new Covid cases దేశంలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 43 వేల కేసులు

India reports 42 909 new covid 19 cases 380 deaths in last 24 hours

third wave, Indian Council of Medical Research, Covid cases, Coronavirus, Covid third wave in India, ICMR, Covid-19 cases in India, Dr Samiran Panda, corona second wave, corona cases in India, coronavirus india updates

India's Covid chart showed slight improvement today, with the country recording 42,909 cases, a drop of 4.7 per cent from yesterday. About 380 deaths were recorded during the period, according to the Health Ministry. Active cases constitute 1.15% of total cases, while the national COVID-19 recovery rate stands 97.51 per cent, the Union Health Ministry said.

దేశంలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 43 వేల కేసులు

Posted: 09/01/2021 11:20 AM IST
India reports 42 909 new covid 19 cases 380 deaths in last 24 hours

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొనసాగుతోంది. క్రితం రోజుతో పోల్చితే ఇవాళ పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. అంతేకాదు, కోవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ పెరుగుదల థర్డ్ వేవ్ కు సంకేతమేనా అన్న అనుమానాలు, భయాంధోళనలు కూడా దేశప్రజల్లో నెలకొన్నాయి. నిన్నమొన్నటి వరకు 30 వేల పైచిలుకు కేసులు రోజువారిగా నమోదు కాగా తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,965 పాజిటివ్ కేసులు, 380 మరణాలు నమోదయ్యాయి. అలాగే ఈ మహమ్మారి నుంచి మరో 33,964 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 3,28,10,845 కాగా, ఇందులో యాక్టివ్ కేసులు 3,78,181, కోలుకున్నవారి సంఖ్య 3,19,93,644గా ఉంది.

అలాగే దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 4,39,020 మంది మరణించారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో కేరళలో 30,203 పాజిటివ్ కేసులు, 115 మరణాలు సంభవించాయి. అటు మహారాష్ట్రలో 4196 పాజిటివ్ కేసులు, 104 మరణాలు వెలుగు చూశాయి. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత ప్రపంచ రికార్డ్ సృష్టించింది. 1,30,82,756 వ్యాక్సిన్లు పంపిణీ చేసి ప్రపంచంలో ఒక్కరోజులోనే అత్యధిక వ్యాక్సిన్లు వేసిన దేశంగా భారత్ నిలిచిందన్నారు. అంతేకాదు.. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం 65 కోట్ల కీలక మైలురాయిని దాటింది. అంతకు ముందు రోజు 59,62,286 మందికి టీకాలు వేశారు.

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. దేశంలో సెకండ్ వేవ్ ప్రభావం అంతగా లేని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ అత్యంత ప్రభావాన్ని చూపుతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో వాక్సీనేషన్ ప్రకియను కూడా కేంద్ర కుటుంభఅరోగ్య శాఖ కూడా వేగిరం చేసింది. కాగా, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో థర్డ్ వేవ్ రావచ్చని వైద్య నిపుణులు చెబుతుండటం.. అలాగే అక్టోబర్‌లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కి చేరుతుందని అనడంతో కేంద్ర ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రాలన్నీంటికి మార్గదర్శకాలు జారీ చేసింది. అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles