కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత సంవత్సరం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో సింఘు, టిక్రీ ప్రాంతాలలో గత ఎనమిది నెలలుగా రైతులు చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిసెంబర్ 26 నుంచి రైతులు తమ సంక్షేమాన్ని కాంక్షించే రైతు సంఘాలతోఈ ఉద్యమాన్ని కోనసాగిస్తునే వున్నారు. చలికి వణుకుతూ, ఎండలకు ఎండుతూ.. వర్షాలకు తడుస్తూ.. ఎట్టిపరిస్థితుల్లో తాము వెనక్కి తగ్గేది లేదని రైతన్నలు తెగేసి చెబుతున్నారు. ఇక కరోనా లాంటి కష్టకాలంలోనూ రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. దీక్షాస్థలితోనే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కోసం దీక్షను వదిలేస్తే.. సాగు బిల్లులతో తమ భవిష్యత్తే అంధకారం అవుతుందని, ఇలాంటి తరుణంలో తాము దీక్షను కొనసాగించేందుకే సముఖంగా వున్నామని రైతులు తెలిపారు. కాగా, ఈ సెప్టెంబర్ 25తో తొమ్మిది నెలలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు నిరసనగా గత ఏడాది నవంబర్ నుంచి జరుగుతున్న ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు బంద్‌కు పిలుపు ఇచ్చామని ఎస్కేఎం వెల్లడించింది.
సింఘు బోర్డర్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్కేఎం ప్రతినిధి అశీష్ మిట్టల్ మాట్లాడుతూ భారత్ బంద్ వివరాలను తెలిపారు. గత ఏడాది ఇదే రోజున తాము దేశవ్యాప్త బంద్‌ను జరిపామని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో గత ఏడాది జరిగిన బంద్ కంటే ఈసారి భారత్ బంద్ మరింత విజయవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునకు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు కూడా పలు రాజకీయ పార్టీలు ముందుకు రానున్నాయి. మరీ ముఖ్యంగా యూపీఏ పక్ష పార్టీలు రైతులకు మద్దతు తెలుపనున్నాయి.
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more