Police arrested Teenmaar Mallanna on blackmailing charges బ్లాక్ మెయిల్ అరోపణలపై తీన్మార్ మల్లన్న అరెస్టు..

Police arrested teenmaar mallanna on blackmailing charges

Teenmaar Mallanna, Arrest, chikadpally police, Astrologer, Lakshmikant Sharma, Blackmailing, Hyderabad Police,Q News Office, Police Raids, CM KCR, Srinivas Goud, Corruption, Telangana Rashtra Samithi, TRS social media convenor Krishank, Youtube channel, Cybercrime police, Telanagana, politics, Crime

Popular political activist and journalist Chintapandu Naveen Kumar alias Teenmaar Mallanna, has been arrested by Chikadpally Police on Black mialing charges lodged by popular astrologer LakshmiKanth Sharma. Recently Hyderabad Cyber Crime Police Raids again the House of Teenmaar Mallanna and his Q News Office again, just after three weeks when they allegedly raided Q news Office.

బ్లాక్ మెయిల్ అరోపణలపై తీన్మార్ మల్లన్న అరెస్టు..

Posted: 08/28/2021 11:53 AM IST
Police arrested teenmaar mallanna on blackmailing charges

తీన్మార్ మల్లన్నగా  తెలంగాణ ప్రజలకు సుపరిచుతుడైన ప్రముఖ జర్నలిస్ట్.. అలియాస్ చింతపండు నవీన్‌ కు చెందిన యూట్యూబ్ చానెల్ క్యూ న్యూస్ కార్యాలయంతో పాటు అతని ఇంటిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దాడులు చేసి.. వారం రోజులు కూడా గడువక ముందే.. మరోమారు అయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన కొద్దిపాటి మెజారిటీతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూసిన తరుణంలో ఆయనను అధికార పార్టీ టార్గెట్ చేసిందన్న అరోపణల నేపథ్యంలో రెండో పర్యాయం అరెస్టు చేయడంతో చర్చనీయాంశంగా మారింది.

డబ్బుల కోసం తీన్మార్ మల్లన అలియాస్ చింతపండు నవీన్.. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్‌శర్మ ఏప్రిల్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.30 లక్షలు కావాలని మల్లన్న తనను బెదిరిస్తున్నాడని, ఇవ్వకుంటే తన చానల్ లో తప్పుడు కథనాలు ప్రచారం చేసి తన ప్రతీష్టకు భంగం కలిగిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని లక్ష్మీకాంత్‌శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల తరువాత నవీన్ పై నమోదైన కేసుపై పోలీసులు కదిలారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అయితే కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు ఇప్పటికే మల్లన్నకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా అదేశించారని, అయినా ఆయన నోటీసులను బేఖాతరు చేశారని సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్నను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే తెలంగాణ యాస, బాషలో వ్యంగోక్తులు విసురుతూ విమర్శనాత్మక శైలిలో అభిప్రాయాలను వ్యక్తం చేసే మల్లన్నకు గత కొంతకాలంగా అధికార పార్టీ టార్గెట్ చేసిందన్న అరోపణలు వున్నాయి. దీంతోనే అయనపై పోలీసుల కేసులు నమోదు కావడం.. ఆయన కార్యాలయాలపై పోలీసుల దాడులు జరగడం పరిపాటిగా మారాయన్న అరోపలూ వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh