SC orders shifting of ex-Unitech promoters from Tihar jail తీహార్ జైలులో రహస్య కార్యాలయం.. అధికారుల సహకారం..

Ed says unitech owners operating from tihar sc orders move to mumbai jail

supreme court, unitech, unitech promoters, jail, tihar jail, sanjay chandra, ajay chandra, Unitech Group, Mumbai Arthur Road Jail, Taloja Jail, secret office, Enforcement Directorate, Ex Unitech Directors, Crime

The Supreme Court has ordered the shifting of former Unitech promoters Sanjay Chandra and Ajay Chandra from Tihar jail to Mumbai's Arthur Road Jail and Taloja Jail. The promoters of the Unitech Group had a secret office at a posh South Delhi location, which has been recently discovered, the Enforcement Directorate informed the Supreme Court.

తీహార్ జైలులో రహస్య కార్యాలయం.. అధికారుల సహకారంతో యూనిటైక్ ఆగడాలు..

Posted: 08/26/2021 09:10 PM IST
Ed says unitech owners operating from tihar sc orders move to mumbai jail

జైళ్లో వుండే ఖైదీలకు అక్కడ డబ్బును వెచ్చిస్తే సకల సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్న అరోపణలు ఇప్పటికే వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఢిల్లీలోని గ్యాంగ్ స్టర్ల వీడియో బయటకు రావడంతో ఈ వార్తలకు ఇప్పటికే బలం చేకూరింది. అయితే కేవలం సెల్ ఫోన్, మందు, సిగరెట్, స్నాక్స్ మాత్రమే కాదు.. అవసరం మేర డబ్బులు చేతులు మారితే.. ఖైదీలకు రహస్య కార్యాలయాలు కూడా సమకూరుతాయని తాజా అరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అరోపణలు చేసింది ఎవరో రాజకీయ పార్టీల నేతలు కాదు. ఏకంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈఢీ) అధికారులే.

అయితే ఈడీ అధికారులు ఈ మేరకు దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో ఈ తరహా అరోపణలు గుప్పించారు. అయితే ఏదో చిన్నపాటి జైలులోఇలాంటి ఘటనలు జరుగుతాయని అనుకుంటే పోరబాటే. నేరస్థుల గుండెల్లో సింహస్వప్నమైన తిహార్ జైలులో కూడా ఇదే తరహా ఘటను చోటుచేసుకుంటున్నాయి. ప్రజల నుంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పేరుతో అక్రమంగా వేలాది కోట్లు సేకరించిన యూనిటెక్ సంస్థ వ్యవస్థాపకులు రమేష్ చంద్ర, సంజయ్ చంద్ర ఇద్దరూ కలిసి ఢిల్లీలోని తీహార్ జైల్లో రహస్య కార్యాలయాన్నినిర్వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. తమ దర్యాప్తులో ఈ సంచలన విషయాలు వెల్లడైనట్లు ఈడీ తెలిపింది.

ఈ ఆఫీసును రమేష్ చంద్ర నిర్వహిస్తుండగా.. బెయిల్‌ లేదంటే పెరోల్‌పై ఉన్న సమయంలో ఆయన కుమారులు సంజయ్, అజయ్ ఇద్దరూ ఈ ఆఫీసుకు వచ్చేవారని ఈడీ వెల్లడించింది. ఈ రహస్య ఆఫీసు నుంచి వందలాది సేల్ డీడ్స్, డిజిటల్ సంతకాలు, పలు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు సుప్రీంకోర్టుకు అదనపు సొలిసిటర్ జనరల్ మాధవీ దివాన్ వివరించారు. యూనిటెక్ వ్యవస్థాపకులు తమకు అనుకూలంగా ఉండే అధికారులను జైల్లో నియమించుకున్నారని, ఇలా బయటకు తమ మాటలు చేరవేస్తున్నారని ఈడీ రిపోర్టు తెలిపింది.

ఈ రిపోర్టును పరిశీలించిన సుప్రీంకోర్టు.. చంద్ర కుటుంబాన్ని తీహార్ జైలు నుంచి తొలగించి మహారాష్ట్రలోని ఆర్థర్ రోడ్, తలోగా జైళ్లకు తరలించాలని ఆదేశించింది. ఈ చర్యలతో సంజయ్, అజయ్ ఇద్దరూ జ్యూడిషీయల్ వ్యవస్థనే అపహాస్యం చేశారని ఈడీ తెలిపింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. తీహార్ జైలు ఇటీవలి కాలంలో నేరస్థుల అడ్డాగా మారిందని, జైలు నుంచే క్రిమినల్స్ తమ కార్యకలాపాలు జరుపుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే ఈ కేసుతో సంబంధమున్న జైలు అధికారులపై దర్యాప్తు జరిపి, 4 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles