TTD's “Sampradaya Bhojanam” Trail run commences తిరుమ‌ల‌లో సంప్రదాయ భోజ‌నం.. చిరుధాన్యాల ఆహ‌రంతో ఆరోగ్యం..

Annaprasadam to devotees on the lines of govinduniki go adharita naivedyam

Tirumala Sampradaya Bhojanam, Samoradaya Bhojanam, Tirumala, Srivari Devotees, Tirupathi, cost to cost rate, panchgavya products, millets, cereals, Healthy food, cow dung based organic food, Andhra Pradesh, Devotional

With a noble aim and gesture to promote Desi cow products, organic and natural farming TTD has ventured on yet another novel idea providing healthy food to devotees in the name of “Sampradaya Bhojanam”. A trial-run of the same was commenced at Annamaiah Bhavan in Tirumala on Thursday.

తిరుమ‌ల‌లో సంప్రదాయ భోజ‌నం.. చిరుధాన్యాల ఆహ‌రంతో ఆరోగ్యం..

Posted: 08/26/2021 07:28 PM IST
Annaprasadam to devotees on the lines of govinduniki go adharita naivedyam

సంప్రదాయ భోజ‌నంపై భ‌క్తుల అభిప్రాయాలు, సూచ‌న‌లు తీసుకుని సెప్టెంబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు టిటిడి ప్రయోగాత్మకంగా నిర్వహించ‌నుంది. ఈ సంద‌ర్భంగా దేశీయ వ్యవసాయ ప‌రిశోధ‌కులు విజ‌య‌రామ్ మాట్లాడుతూ.. మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన గో ఆధారిత వ్యవసాయంతో పండించిన దేశీయ బియ్యం, ప‌ప్పుదినుసులు, కూర‌గాయ‌లను టిటిడి కోనుగోలు చేయ‌డం అభినంద‌నీయమ‌న్నారు. దీనిద్వారా దేశీయ విత్తనాలు, దేశీయ గో జాతులను గ్రామ‌ల్లోకి పునః ప్రవేశ పెట్టవ‌చ్చన్నారు.

అనంత‌రం చిరుధాన్యాల ఆహ‌ర నిపుణులు రాంబాబు మాట్లాడుతూ.. దేశీయ ఆవునెయ్యి, బెల్లం, గానుగ నూనెతో వంట‌లు వండి భ‌క్తుల‌కు వ‌డ్డిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉద‌యం కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మా త‌యారు చేసి అందించిన‌ట్లు తెలిపారు. ఇందులో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన సూక్ష్మ పోష‌కాలు, అనేక వ్యాధుల‌ను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శ‌క్తి ఉంటుంద‌న్నారు.

మ‌ధ్యాహ్నం కొబ్బరి అన్నం, పులిహోర‌, పూర్ణాలు, వ‌ర్ష రుతువులో తీసుకోవాల్సిన అహారమైన ప‌చ్చి పులుసు, దోసకాయ ప‌ప్పు త‌దిత‌ర 14 ర‌కాల వంట‌కాలు చెఫ్ గోపి వండి భ‌క్తుల‌కు అందించిన‌ట్లు వివ‌రించారు. భ‌విష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవ‌డంతో మ‌న ఆరోగ్యంతో పాటు రైతు సంక్షేమం, గో సంక్షేమం,దేశం కూడా ఆర్థికాభివృద్ధి చెందుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు ర‌మేష్‌బాబు, హ‌రీందర్‌నాథ్‌, లోక‌నాథం, భాస్కర్‌‌, ఈఈ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, మాజీ బోర్డు స‌భ్యులు శివ‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles