Police Officials Sad State Of Affairs: CJI Ramana పోలీసు అధికారుల వ్యవహార తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Police officials siding with ruling party get targeted later sad state of affairs cji ramana

police officials, targeted, cji ramana, supreme court, sedition, Justice Surya Kant, Gurjinder Pal Singh, chhattisgarh, Police, sedition case, politics

The Chief Justice of India NV Ramana made comments about the trend of police officials siding with the party in power and later getting targeted when the opponent comes to power.

పోలీసు అధికారుల వ్యవహార తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Posted: 08/26/2021 06:39 PM IST
Police officials siding with ruling party get targeted later sad state of affairs cji ramana

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసు ఉన్నతాధికారుల వైఖరి పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రస్తుతం పోలీసు అధికారులు కొత్త ట్రెండ్ ను అవలంభిస్తున్నారని.. దీంతో వారిపై అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడింది. ఓ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడంతో వీరిని మరో రాజకీయ పార్టీ అధికారంలోకి రాగానే టార్గెట్ గా మార్చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ పద్దతికి స్వస్తి పలకాల్సిన అవశ్యకత వుందని తెలిపింది.

కొంతమంది పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించింది. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం ఏంచేసేందుకైనా సిద్ధపడుతున్నారని పేర్కొంది. అధికార పార్టీ నేతల రాజకీయ ప్రత్యర్థులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు సేవలు అందించాల్సిన పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాయడం కలవరపరిచే అంశం అని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తుండడం దురదృష్టకరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి దుస్సంప్రదాయానికి తెరపడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. చత్తీస్ గఢ్ కు చెందిన సస్పెండయిన అదనపు డైరెక్టర్ జనరల్ ఆప్ పోలీసుగా బాధ్యతలు నిర్వహించిన గుర్జిందర్ పాల్ సింగ్ తనపై నమోదైన దేశద్రోహం కేసును కోట్టివేయాలని దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థాన ద్విసభ్య ధర్మాసనం.. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు జస్టిస్ సూర్యకాంత్ తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీసులు కచ్చితంగా చట్టానికి లోబడి వ్యవహరించాలని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles