Kothagudem: Youth gets 20-year RI for raping minor చిన్నారిపై లైంగిక దాడి కేసు.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష

Kothagudem youth gets 20 year rigorous impirsonment for raping minor

Minor rape case accused, rigorous imprisonment, First Additional District Sessions Judge, P Chandrasekhara Prasad, Burgampad SI, Balakrishna, kothagudem, minor, minor rape, pocso case, Paloncha DSP, KRK Prasad, Telangana, crime

A youth accused in a POCSO case was sentenced to 20 years of rigorous imprisonment by Khammam district court. First Additional District Sessions Judge, P Chandrasekhara Prasad pronounced the final verdict in the rape case that took place at Sarapaka village of Burgampad mandal in the district in November, 2020.

చిన్నారిపై లైంగిక దాడి కేసు.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష

Posted: 08/24/2021 11:23 AM IST
Kothagudem youth gets 20 year rigorous impirsonment for raping minor

చాక్లెట్లు కొనుక్కునేందుకు దుకాణానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై నేరాభియోగాలు రుజువుకావడంతో.. న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని దోషిగా పరిగణించిన ఖమ్మం జిల్లా ఫస్ట్ అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు.. అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగారవాసాన్ని శిక్షగా పరిగణించింది.

ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖమ్మం జిల్లా పోలీసులు.. నిందితుడికి 20 ఏళ్ల శిక్ష పడటంతో బాధిత కుటుంబానికి న్యాయాన్ని అందించామని సంతోషాన్ని వ్యక్తపర్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పింగళి గణేశ్ అలియాస్ చింటూ (20)కి కిరాణా దుకాణం ఉంది. గతేడాది నవంబరు 19న చాక్లెట్ కొనుక్కునేందుకు దుకాణం వద్దకు వచ్చిన బాలికను చూసిన చింటూ ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అనంతరం ఏడుస్తూ ఇంటికి చేరుకున్న బాలికను చూసిన తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా చిన్నారి చెప్పింది విని విస్తుపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిన్న ఈ కేసు తుది విచారణకు రాగా, ఖమ్మం మొదటి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పి.చంద్రశేఖరప్రసాద్ నిందితుడు గణేశ్‌ను దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ కేసును పాల్వంచ ఎస్ఐ బాలకృష్ణ రిజిస్టర్ చేసి.. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ పకడ్భంధీగా న్యాయస్థానంలో సమర్పించారు. పాల్వంచ డీఎస్సీ ప్రసాద్ కూడా ఈ కేసును నిందితుడికి శిక్షపడేలా ఎస్ఐకి ఎప్పటికప్పుడు సూచనలు అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles