Varalakshmi Vratam being performed in Telugu states తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మీవత్ర శోభ.. వాయినాలు ఇస్తున్న ముత్తైదువులు

Varalakshmi vratam being performed in telugu states by married hindu women

Sravana Laxmi, Sravana Masam, Telugu Festival, Varalaxmi Vratam, HIndu married women, women devotees, vayanam, Thambulam, Pasupu Kumkuma, Sri Laxmi Devi, Varalakshmi Vratham, Varalakshmi Vratham puja vidhi, how to perform Varalakshmi Vratham puja, Varalakshmi Vratham significance, Telangana, Andhra Pradesh, Devotional

Goddess Varalakshmi is believed to have the powers of Ashta Lakshmi. Married women keep a fast on the Friday before Aadi Pournami. The Vratam observed on the Friday before Shravan Purnima. This annual festival is dedicated to the Goddess, who is said to have the combined powers of Ashta Lakshmi (the eight forms of the Devi Lakshmi), the consort of Lord Vishnu.

తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మీవత్ర శోభ.. వాయినాలు ఇస్తున్న ముత్తైదువులు

Posted: 08/20/2021 11:34 AM IST
Varalakshmi vratam being performed in telugu states by married hindu women

తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మీ వత్ర శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున హిందూ వివాహిత మహిళలు ఎంతో భక్తిశ్రద్దలతో వరలక్ష్మీ వత్రాన్ని జరుపుకోవడం పరిపాటి. దీంతో మహిళలు వేకువ జామునే లేచి అమ్మవారి వత్రం చేసుకునేందుకు ఇళ్లు వాకిళ్లు శుభ్రం చేసి.. ఆవు పేడతో కల్లాపి చల్లి.. అందంగా ముగ్గులు వేసి.. కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారిని ఆహ్వానించేందుకు సిద్దం అవుతున్నారు. ఇవాళ ఘనంగా వరలక్ష్మీ పూజ చేసిన ముతైదువలు.. తమ బంధుమిత్రులను ఇళ్లకు అహ్వానించి వారికి వాయినం (తాంబులం) ఇస్తారు.

వర అంటే శ్రేష్ఠమైనదని అర్థం. శ్రేష్ఠమైన లక్ష్మిని ఆరాధించడమే వరలక్ష్మీ వ్రతం. సర్వసాధారణంగా మహిళలు ఏ శుక్రవారం రోజున తమ ఇళ్లలోంచి పసుపు కుంకుమలను బయటకు వెళ్లనివ్వరు.. కానీ ఇవాళ మాత్రం అమ్మవారి వత్రం అచరించిన తరువాత వారే ఇరుగుపోరుగు వారితో పాటు బంధుమిత్రులను పిలిచి పాదాలకు పసుపు రాసి.. కుంకుమ బోట్టు పెట్టిన తరువాతే వాయినాలను అందిస్తారు. ఇలా చేయడం ద్వారా తమ సౌభాగ్యాలకు, సుఖ సంతోషాలకు ఏఢాది వరకు ఎలాంటి ఢోకా వుండదని భక్తుల విశ్వాసం.  

మామిడి ఆకుల తోరణాలు, పూలను గుమ్మాలకు కట్టి.. తరువాత అమ్మవారిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో అక్కడ అరటి ఆకులు, మామిడి ఆకులు, పూలు, తోరణాలతో ఆలకరించి.. లక్ష్మీ దేవి అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు వర్ణం పూలతో పీఠాన్ని ఆలంకరిస్తారు. గణపతి పూజతో వ్రతం ప్రారంభించిన తరువాత.. కలశస్థాపన ద్వారా లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకుని ఆతరువాత వత్రం చేస్తారు. షోడషోపచార పూజలతో పాటు వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లలితా సహస్రనామాలు, లక్ష్మీదేవి స్త్రోత్తాలు పఠించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు.

అనంతరం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు. సర్వోపచారాలు చేసిన తర్వాత కంకణాలు కట్టుకుంటారు. అనంతరం చేతుల్లో అక్షింత‌లు తీసుకొని వరలక్ష్మీ వ్రతకథ (చారుమతి కథ)ను చదవిన తరువాత ఆ అక్షింత‌ల‌ను వారి శిరసుపై వేసుకోవడంతో పాటు కుటుంబసభ్యుల శిరసులపై కూడా వేస్తారు. అమ్మవారికి నీరాజనం సమర్పించిన తరువాత ఇంట్లోని పెద్దలకు పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులను తీసుకుంటారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన బంధుమిత్రులు, ఇరుగుపోరుగు వారికి వాయినాలను ఇస్తారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వివాహితలు ఆచరించే ఈ వత్రాలతో పండుగ శోభ సంతరించుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles