TTD Board give shock to Tirumala SriVari Devotees తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు షాక్.!

Ttd board give shock to tirumala srivari devotees halts september darshan tickets

TTD, Srivari darshan September tickets, Special darshan tickets, September special darshan tickets, Special Entry Darshan tickets, Tirumala, Tirumala News, TTD, Tirumala tirupati Devasthanam, TTD Board, TTD Chairman, Laddu prasadams, Andhra pradesh, politics

Tirumala Tirupati Devasthanam Board has given shock to Tirumala SriVari Devotees, by halting the quota of September Darshan Tickets. The online quota of Rs 300 special entry darshan tickets for the month of September had not been released today. TTD said it will announce the release of tickets later.

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు షాక్.. విడుదల కానీ కోటా.!

Posted: 08/20/2021 10:42 AM IST
Ttd board give shock to tirumala srivari devotees halts september darshan tickets

తిరుమల శ్రీవారి ఏడుకొండలు ఎక్కినా.. భక్తులకు మాత్రం స్వామివారి దర్శనం కలగడం లేదు. కరోనా కష్టకాలంలో దేవుడా నువ్వే దిక్కు అని ఆర్తితో.. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని వేడుకుందామనుకుంటే.. అందుకు సర్వదర్శనానికి అనుమతి లేకుండా చేసింది బోర్డు. దీంతో ఎలాగో నానా ప్రయాసలు పడి తిరుపతి చురుకున్న భక్తులు.. తిరుమలకు చేరకుందామనుకుంటే.. అనుమతి లేదంటున్నారు భద్రతాధికారులు. దీంతో మరింత వ్యవయమైనా ఫర్వాలేదని దేవుడి దర్శనం చేసుకునే కదులుదామని భావించిన భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్టు కొనేందుకు పోటీ పడుతున్నారు.

గత నెలలో భక్తుల తాకిడి ఎంతగా ఉందంటే.. అలా టికెట్లు విడుదైలన క్షణాల్లోనే టికెట్లు అయిపోయాయి. భక్తుల నుంచి వస్తున్న విపరీతమైన స్పందన నేపథ్యంలో గత నెల 28న మళ్లీ రోజుకు 3000 టికెట్లను అదనంగా కూడా విక్రయించారు. అయినా హాట్ కేకుల్లా అయిపోయాయి. భక్తులకు కొంగుబంగారమైన తిరుమల శ్రీవారి దర్శనం పోందెందుకు కేవలం అన్ లైన్ టికెట్లు వున్న భక్తులకు మాత్రమే లబిస్తోంది. మిగతాభక్తులను తిరుమల శ్రీవారు కరికరించడం లేదు. గోవిందా.. గోవిందా అంటూ మెట్లు ఎక్కినా.. లేక ఏడు కొండలను కారులో, బస్సులో లేదా ఇతరాత్ర రవాణా సౌకర్యాలతో చేరినా.. తిరుమలేశుడు మాత్రం కానరావడం లేదు. దీంతో భక్తులు ఏ చోట చూసినా నీవుందువందురే.. ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా అంటూ తిరుగు పయనం అవుతున్నారు.

అయితే చేసేదిలేక ఆన్ లైన్ లోనే టికెట్లు తీసుకుందామని భక్తులు వేచి చూస్తున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు షాక్ ఇచ్చింది. ప్రతీ నెల 20వ తేదీన విడుదల కావాల్సిన మరుసటి నెల అన్ లైన్ ప్రత్యేక దర్శన కోటా టికెట్ల విషయంలో భక్తులు ఖంగుతినేలా చేసింది. ఇవాళ (ఆగస్టు 20న) విడుదల కావాల్సిన సెప్టెంబర్‌ మాసానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి నెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే టికెట్ల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.

భక్తులు విషయాన్ని గమనించాలని కోరింది. అయితే కోటా రిలీజ్‌కు కాకపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే టీటీడీ అందుబాటులో ఉంచుతోంది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తోంది. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందని, ఇందులో భాగంగానే టికెట్ల కోటా పెంపును వాయిదా వేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles