"Years of torture": Shashi Tharoor after verdict on wife's death శశిథరూర్ కు ఢిల్లీ కోర్టులో ఊరట.. భార్య మృతికేసులో అభియోగాలు కొట్టివేత

Sunanda pushkar death case shashi tharoor discharged by delhi court

Shashi Tharoor, Sunanda Pushkar case, Sunanda Pushkar, Sunanda Pushkar death, Sunanda Pushkar death case, Sunanda Pushkar Death Probe, Sunanda Pushkar murder case, Delhi court, Special Investigation Team, SIT to FBI, SIT on Sunanda Pushkar murder case, Crime

When a Special Judge at Rouse Avenue discharged Congress MP Shashi Tharoor in the death case of his late wife Sunanda Pushkar, he said this was “seven-and-a-half years of absolute torture”. For three years Tharoor’s advocates have been arguing on the point of charge in this high voltage case which went through various twists and turns.

శశిథరూర్ కు ఢిల్లీ కోర్టులో ఊరట.. భార్య మృతికేసులో అభియోగాలు కొట్టివేత

Posted: 08/18/2021 08:08 PM IST
Sunanda pushkar death case shashi tharoor discharged by delhi court

సునంద పుష్క‌ర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌కు ఢిల్లీ సెష‌న్స్‌ కోర్టులో ఊర‌ట ల‌భించింది. ఈ కేసులో శ‌శిథ‌రూర్ పై మోపబడిన అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేసింది. 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్ లో సునందా పుష్కర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చార్జ్ షీట్‌ దాఖలు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకోవ‌డానికి ఓ ర‌కంగా శ‌శిథరూరే కార‌ణ‌మ‌య్యార‌ని 2018లో పోలీసులు చార్జ్ షీట్ దాఖ‌లు చేశారు.

ఆమె మృతి చెంద‌డానికి ముందు ఆమె చేసిన మెయిల్స్ తో పాటు సామాజిక మాధ్య‌మాల్లో చేసిన పోస్టుల‌ను పోలీసులు అప్ప‌ట్లో ప‌రిశీలించారు. త‌న‌కు బ‌త‌కాల‌ని లేద‌ని, మృతి చెంద‌డానికి వారం రోజుల ముందు శ‌శిథ‌రూర్ కి ఆమె ఓ మెయిల్ పంపార‌ని అప్ప‌ట్లో పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆమె అప్ప‌ట్లో బ‌స చేసిన హోట‌ల్ లో పోలీసుల‌కు 27 అల్ ప్రాక్స్ మాత్ర‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. శ‌శిథ‌రూర్‌, సునంద పుష్క‌ర్‌కు 2010లో వివాహం జ‌రిగింది. గొడ‌వ‌ల కార‌ణంగా సునంద పుష్క‌ర్ యాంటీ-డిప్రెష‌న్ మాత్ర‌లు తీసుకునే వార‌ని అప్ప‌ట్లో పోలీసులు తెలిపారు.

ఈ కార‌ణాల వ‌ల్ల శ‌శిథ‌రూర్ పై అభియోగాలు న‌మోదు చేశారు. చివ‌ర‌కు ఆయ‌న‌కు సెష‌న్స్ కోర్టులో ఊర‌ట ల‌భించింది. కాగా న్యాయస్థానం తీర్పు విన్న తరువాత కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శశిథరూర్  ఈ కేసుపై స్పందించారు. గత ఏడున్నరేళ్లుగా తాను అనుభవిస్తున్న నరకానికి ఎట్టకేలకు ముగింపు దొరికిందని ఆయన అన్నారు. తన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య కేసులో థరూర్ పై ఉన్న అభియోగాలన్నింటినీ ఢిల్లీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో.. ఆ తీర్పుపై ఆయన స్పందించారు. జడ్జిలు గొప్ప తీర్పు ఇచ్చారని ఆయన కొనియాడారు.

సునంద పుష్కర్ ఆత్మకు కూడా న్యాయస్థానం తీర్పుతోనే శాంతిచేకూరుతుందని అన్నారు. ‘‘నా భార్య సునంద మరణం తర్వాత ఎంతో కాలం నా చుట్టూ అలముకున్న కారు చీకట్లు ఈ తీర్పుతో తొలగిపోయాయి. ఆమె మరణంపై నా మీద ఎన్నెన్నో నిరాధారపూరితమైన ఆరోపణలను మోపారు. మీడియా ఎన్నో అభాండాలను వేసింది. అయితే, ఇప్పుడు వచ్చిన తీర్పు న్యాయవ్యవస్థపై నా నమ్మకాన్ని మరింత పెంచింది. తప్పు చేస్తే మన న్యాయవ్యవస్థ కచ్చితంగా శిక్షిస్తుంది. ఏదిఏమైనా న్యాయం జరిగింది’’ అని ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles