Terror attack alert in Delhi before August 15th ఈసీ వెబ్ సైట్ హ్యాక్.. పది వేల ఫేక్ ఐడీ కార్డుల తయీరీ.. నలుగురు అరెస్ట్..

Fake voter id card made by hacking ec s website 4 arrested

EC website hacked, election commission website, four youths arrested, fake voter id cards, police, Vipul Saini, Hariom Singh, Morena, madhya pradesh, crime

Cyber hackers have done a big thing by hacking the website of the Election Commission of India. In this case, it is alleged that hackers have produced more than 10,000 fake voter ID cards. In fact, recently, Madhya Pradesh police have detained four teenagers from Morena in the case.

ఈసీ వెబ్ సైట్ హ్యాక్.. పది వేల ఫేక్ ఐడీ కార్డుల తయీరీ.. నలుగురు అరెస్ట్..

Posted: 08/14/2021 11:57 AM IST
Fake voter id card made by hacking ec s website 4 arrested

సైబర్ హ్యాకర్లు భరితెగించిపోయారు. ఏకంగా భారత ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ హ్యాక్ చేసి నకిలీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు నెలల వ్యవధిలో 10 వేలకు పైగా నకిలీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేశారు. దీని బట్టి ఎన్నికల కమీషన్ అధికారులు ఎంతటి మొద్దు నిద్రలో వున్నారో ఇట్టే అర్థం అవుతోంది. మూడు నెలలుగా ఈ తంతు జరుగుతున్నా.. ఇటీవల గుర్తించి.. పోలీసులకు పిర్యాదు చేయడంతో గుట్టు రట్టు అయ్యింది. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మధ్యప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడ మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు, ఓటర్ల జాబితా.. వారి ఓటర్ ఐడీ కార్డులతో పాటు ఇతరత్రా కీలక సమాచారం నిక్షిప్తం అయ్యిఉంటుంది. అయితే..ఓ వ్యక్తి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ హ్యాక్ చేశాడని అధికారులు తెలుసుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. హ్యాక్ చేసింది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాసిగా గుర్తించి.. విపుల్ సైని (24) యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ఈ యువకుడు దాదాపు పది వేలకు పైగా నకిలీ ఓటర్ ఐడీలను తయారు చేసినట్లు గుర్తించారు.

ఇతను బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA)..డిగ్రీ కలిగిన ఇతను మూడు నెలల్లో 10 వేల ఫేక్ ఐడీలను క్రియేట్ చేశారని తేలింది. ఇలా చేయడానికి కారణమేంటని విచారించిన పోలీసులకు మధ్యప్రదేశ్ లోని మెరినాకు చెందిన హరిఓం సింగ్ అనే వ్యక్తి కోసమే తాను ఈ పని చేశానని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. దీంతో హరిఓం సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారించగా.. తాను అర్మన్ మాలిక్ అనే వ్యక్తికి ఈ పనులు చేయించినట్లు చెప్పడని పోలీసులు తెలిపారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మధ్యప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు.

మధ్యప్రదేశ్ పోలీసులు సైనీతో నేరుగా సంప్రదింపులు జరిపిన ఓ దినసరి కూలి కొడుకైన 18 ఏళ్ల టీనేజర్ హరీఓం సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనితో ఈ వ్యవహారం విషయమై క్లోజ్ గా మెలిగిన మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, విపుల్ సైని ఒక్కో ఐడీ కార్డుకు రూ. 100 నుంచి రూ. 200 చొప్పున విపుల్ తీసుకున్నాడని, అతని బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 60 లక్షలను సీజ్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ వైబ్ సైట్ హ్యాక్ కాలేదని, తమ వద్ద నిక్షిప్తమైన వున్న డాటా బేస్ పూర్తిగా సురక్షితంగా వుందని ఈసీ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles