Video: Oil Leaks from Crimson Polaris Wreck Off Japan జపాన్ కోస్తా తీరాన్ని తాకిని క్రిమ్సన్ పొలారిస్ ఇంధనం

Cargo ship splits in two causes oil slick after running aground in japan port

Cargo ships, Japan port, Japan cost guard, Panama cargo ship, NYK Japan, wreck, oil spill leak, Crimson Polaris, bulker, Coast Guard, Social media, Viral video

Efforts are continuing to monitor the wreck of the bulker Crimson Polaris as oil continues to leak from the vessel and overspread the area. The wood chip carrier grounded on August 11 and broke apart after the crew had been rescued.

ITEMVIDEOS: జపాన్ కోస్తా తీరాన్ని తాకిని క్రిమ్సన్ పొలారిస్ ఇంధనం

Posted: 08/13/2021 05:29 PM IST
Cargo ship splits in two causes oil slick after running aground in japan port

చమురు రవాణా నౌక క్రిమ్సన్‌ పొలారిస్ రెండు ముక్క‌లైన విషయం తెలిసిందే. దాదాపుగా 40 వేల టన్నుల చెక్కతో చేసిన ఓడ నెలకు తగిలింది. అయితే సముగ్ర గర్భం నుంచి తప్పించుకున్న పొలారిస్ నేలకు తలగడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. అలల తాకిడికి.. అది కాస్తా గురువారం తెల్లవారుజామున రెండు ముక్కలైందని కోస్ట్ గార్డ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో పెద్ద ఎత్తున చ‌మురు స‌ముద్రంలో క‌లిసిపోయింది. ఈ ఓడలోంచి విరజిమ్ముతున్న చమురు ఏకంగా జపాన్ తీరాన్ని తాకిందని జపాన్ అధికారులు తెలిపారు.

జపాన్ లోని విసావా నగర తీరానికి శుక్రవారం ఉదయం చమురు చేరిందని అన్నారు. తీరప్రాంతానికి ఏకంగా 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరానికి చేరిందంటే ఎంత మేర ఇంధనం ఉందన్న వివరాలు తెలియాల్సి వుంది. అదీకాకుండా.. పర్యావరణంపై ఇది ఎలాంటి ప్రభావాని చూపుతుందన్న విషయంలోనూ స్పష్టత కరువైంది. కాగా చమురును అదుపు చేయడానికి అధికారులు ఇప్పటికీ కష్టపడుతూనే వున్నారు. అయితే సముద్రంలో కలసిన చమురును తీసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

జపాన్ లోని అమోరి ఫ్రిఫెక్చర్‌ హచినొహె పోర్టు సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. నౌకలోని చమురు ఎంత మేర సముద్రంలో కలిసింది.. అది పర్యావరణానికి ఎంతటి విఘాతం కలుగుతుందన్న వాటిపై సంబంధిత అధికారులు అధ్యయనం చేస్తున్నారు. నౌకలోని చమురు సముద్రంలో ప‌డ‌డంతో ఏకంగా 24 కిలోమీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పున తెట్టు ఏర్ప‌డింద‌ని చెప్పారు. కాగా, నౌక రెండుగా విడిపోయిన స‌మ‌యంలో అందులో ఉన్న‌ 21 మంది సిబ్బందికి ఏ ప్ర‌మాద‌మూ జ‌ర‌గ‌లేద‌ని, వారు సురక్షితంగా బ‌య‌ట‌ప‌డిన‌ట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NYK Japan  wreck  oil spill leak  Crimson Polaris  bulker  Coast Guard  Social media  Viral video  

Other Articles