Over 500 children, teenagers test positive for COVID-19 బెంగళూరు చిన్నారుల్లో విస్తరిస్తున్న కరోనా

Karnataka over 500 children teenagers test positive for covid 19

delta plus variant, covid-19 in children, coronavirus in children, coronavirus in teenagers, covid-19 in teenagers, coronavirus delta plus variant, COVID-19, covid, Bengaluru, children, Teenagers, schools re-open, Bruhat Bengaluru Mahanagara Palike (BBMP), corona vaccine Antibodies, COVID-19 Vaccines, Coronavirus, Corona Vaccine, Karnataka

As many as 543 children and teenagers in 0-19 years of the age group tested positive for COVID-19 from August 1 to August 11, Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) informed on Friday. However, no deaths were reported in this age group during this period.

బెంగళూరు చిన్నారుల్లో విస్తరిస్తున్న కరోనా.. అందోళన

Posted: 08/13/2021 04:39 PM IST
Karnataka over 500 children teenagers test positive for covid 19

కరోనా మహమ్మారి మూడవ వేవ్ ఆగస్టులో ప్రారంభం అవుతుందని.. సెప్టెంబర్ లో తీవ్రంగా విజృంభిస్తుందని.. ప్రజలందరూ కరోనా మహమ్మారి సోకకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య అరోగ్యశాఖలు విన్నవిస్తూనే వున్నాయి. ఈ వార్తలను కొట్టిపారేయని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసర్చ్ బృందం వైద్యులు కూడా థర్డ్ వేవ్ నిజమని.. ప్రకటించారు. అయితే థర్డ్ వేవ్ పిల్లలపైనే అధికంగా ప్రభావం చూపుతుందని.. పిల్లలను కరోనా బారిన పడకుండా తల్లిదండ్రులే రక్షించుకోవాలని విన్నవించారు.

అయితే గత రెండు నెలలుగా వస్తున్న ఈ ప్రకటన నేపథ్యంలో వార్తలు వినిపిస్తుండటంపై కొందరు అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే కొందరు మాత్రం వార్తల్లో నిజం లేదని తోసిపుచ్చారు. కాగా ఈ ఆందోళనలను నిజం చేస్తూ బెంగళూరులో కరోనా బారిన పడుతున్న చిన్నారులు, టీనేజర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నెల ఒకటి నుంచి పదకొండు వరకు ఏకంగా 500 మందికి పైగా చిన్నారులకు కరోనా సోకింది. కేవలం పది రోజలు వ్యవధిలోనే 500 మంది చిన్నారులకు కరోనా సోకిందని బృహన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) అధికారులు చెప్పారు.

కర్ణాటక ప్రభుత్వం పాఠశాలతో పాటు విద్యా సంస్థలను తెరిచేందుకు సిద్దం అవుతున్న తరుణంలోనే చిన్నారులకు, టీనేజర్లకు కరోనా వ్యాప్తి చెందుతుందని, ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుందని వార్తలు రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులను తీవ్ర అందోళనకు గురిచేస్తున్నాయి, బీబీఎంపీ గణాంకాల ప్రకారం.. ఈ కేసుల్లో గత ఐదు రోజుల్లోనే 263 కేసులు వచ్చాయి. కాగా, కరోనా బారిన పడుతున్న వారిలో 0–19 ఏళ్ల మధ్య వారు 14 శాతం ఉన్నారని బీబీఎంపీ స్పెషల్ కమిషనర్ (హెల్త్) రణ్ దీప్ చెప్పారు. జులై చివరి వారంతో పోలిస్తే ఇప్పుడు పిల్లల్లో కేసులు పెరుగుతున్నాయని ఆయన వివరించారు.

ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల వివరాలనూ ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు. గత పది రోజుల్లో కరోనాతో పిల్లలెవరూ చనిపోలేదన్నారు. తల్లిదండ్రుల నుంచే పిల్లలకు కరోనా సోకుతున్నట్టు ఇటీవలి పరీక్షల్లో తేలిందని చెప్పారు. దాంతో పాటు పిల్లలు బయట ఆడుకొంటున్న సమయంలోనూ కరోనా సోకి ఉండొచ్చని, వారి ద్వారా తల్లిదండ్రులకూ వ్యాపిస్తుండొచ్చని తెలిపారు. పిల్లలకు కరోనా సోకినా లక్షణాలుండట్లేదన్నారు. ఒకవేళ తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేసుకుని ఉంటే.. వారికి కరోనా సోకినా లక్షణాలుండవని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles