CBI to inquire YSRCP state secretary today in YS Viveka case వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని విచారించనున్న సీబిఐ

Ys vivekananda reddy murder case cbi to inquire ysrcp state secretary

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, YSRCP state secretary, Devireddy SivaShanker Reddyy, Raghunatha Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

More than two years after the grisly murder of YS Vivekananda Reddy, the main accused in the case has been remanded for 14 days by Pulivendula court. Now the CBI widens probe angle and inquires the relatives of former minister.

వైఎస్ వివేక హత్యకేసు: వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని విచారించనున్న సీబిఐ

Posted: 08/13/2021 01:03 PM IST
Ys vivekananda reddy murder case cbi to inquire ysrcp state secretary

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన సీబిఐ.. మరో కోణంలోనూ విచారణను కోనసాగిస్తోంది. ఈ క్రమంలో తమ విచారణ వేగం పెంచింది. వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైన దృష్టి సారించారు అధికారులు. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో పలువురిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పలువరు క్రీయాశీలక వ్యక్తులను విచారించనుందని సమాచారం. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడ్ని ఇవాళ సీబిఐ అధికారులు విచారణకు పిలిచారని సమాచారం.

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు పులివెందుల క్యాంప్‌ ఆఫీస్ లో పనిచేసే రఘునాథరెడ్డి కూడా వెళ్లారు. గతంలోనూ సిట్, సీబీఐ బృందాలు శివశంకర్ రెడ్డిని విచారించాయి. ఇక వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) రిజిస్ట్రార్, ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్‌రెడ్డిని ప్రశ్నించింది. వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి వుంటే సాధారణ మరణమని ఎలా అనుకున్నారని అధికారులు ప్రశ్నించగా..  కంగారులో సరిగా గుర్తించలేకపోయినట్టు ఆయన బదులిచ్చినట్టు సమాచారం.

అలాగే, సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్ కుమార్ యాదవ్, మాజీ డ్రైవర్ దస్తగిరిని కారులో ఎక్కించుకుని వివేకా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు అక్కడి ప్రాంతాలను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి మరోమారు ప్రశ్నించారు. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను కూడా ప్రశ్నించారు. మున్నా బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, వివేకానందరెడ్డి పొలం పనులు చూసుకునే జగదీశ్వర్‌రెడ్డి తమ్ముడు ఉమాశంకర్‌రెడ్డి, ఓ యూట్యూబ్ చానల్ విలేకరి, సునీల్ కుమార్ బంధువు భరత్ యాదవ్‌ను సీబీఐ అధికారులు విచారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles